charlapalli
-
ఒక ట్రిలియన్ మేమిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చటంలో తెలంగాణ సహకారం గణనీయంగా ఉండనుందని, రాష్ట్రం నుంచే ఒక ట్రిలియన్ మేర తోడ్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. ఇది సాధించాలంటే తెలంగాణలో రైల్వేల విస్తరణ చాలా అవసరమని అన్నారు. ఇందుకు కేంద్రం సహకరించి ప్రధాని మోదీ కలలుగంటున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు బాటలు వేయాలని కోరారు. హైదరాబాద్ నగర శివారు చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్‌ను సోమవారం మ«ధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరై రాష్ట్రంలో రైల్వే, మెట్రో రైల్‌కు సంబంధించిన డిమాండ్లను ప్రధానమంత్రి ముందుంచారు. బందరు పోర్టుతో అనుసంధానంతో..‘తెలంగాణకు సముద్ర తీరం లేనందున హైదరాబాద్‌కు చేరువలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని బందరు పోర్టుతో అనుసంధానం కావాల్సి ఉంది. కాబట్టి రాష్ట్రం నుంచి ఆ పోర్టుకు వేగంగా, నేరుగా చేరుకునేలా డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అవి ఏర్పడితే మేము డ్రైపోర్టులు ఏర్పాటు చేసుకుంటాం. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. దేశ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 35 శాతం వాటాతో తెలంగాణ ముందంజలో ఉంది. ఆ ఉత్పత్తుల ఎగుమతికి, అవి వేగంగా పోర్టుకు చేరడానికి డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ దోహద పడతాయి. ఆటోమొబైల్ పరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ స్థానికంగా ఎదిగేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. రీజినల్ రింగ్ రైలు పనులు చేపట్టండి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గాను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉంది. రీజినల్ రింగు రోడ్డులో 170 కి.మీ భాగానికి ఇటీవలే కేంద్రం టెండర్లు పిలిచింది. మిగతా భాగాన్ని కూడా చేపట్టడంతో పాటు, రింగు రోడ్డు వెంట రీజినల్ రింగ్ రైల్ పనులు కూడా చేపట్టాలి. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే అనుమతినిచ్చి పనులు జరిగేలా సహకరించాలి. తెలంగాణను కర్ణాటకతో అనుసంధానించే వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ పనులకు కూడా అనుమతి మంజూరు చేస్తే, అది ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాజీపేట ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరైన నేపథ్యంలో దాన్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలి..’ అని సీఎం రేవంత్ కోరారు. దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పదేళ్ల క్రితం 2014లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్లో రూ.251 కోట్లు మాత్రమే దక్కాయని, అదే గతేడాది రూ.5,333 కోట్లు కేటాయించారని, రైల్వేల పురోగతిలో వస్తున్న గణనీయ మార్పునకు ఇది నిదర్శనమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో ఒకటైన భారతీయ రైల్వే ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు అన్ని విధాలా సహకారం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.1.20 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, మరో రూ.80 వేల కోట్లతో పనులు చేపట్టనుందని వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 346 కి.మీ మేర రైల్వే లైన్లను అందుబాటులోకి తెచ్చిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకున్నా, సొంత నిధులతో రైల్వే శాఖనే ఎంఎంటీఎస్ విస్తరణ పనులు చేపట్టిందని గుర్తుచేశారు. రీజినల్ రింగు రోడ్డు కోసం రూ.26 వేల కోట్లు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రైల్వేకు ఆధునిక రూపు: కేంద్రమంత్రి బండి సంజయ్ మెరుగైన వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారానే పురోగతి సాధ్యమని అమెరికా నిరూపించిందని, ఇప్పుడు ఆ మూడు రంగాలను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రైల్వేల అభివద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి ఆధునిక రూపు తెచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 వేల కోట్లకు పైగా వెచ్చించిందని తెలిపారు. అప్రోచ్ రోడ్డుకు గ్రాంటు ఇవ్వండి: శ్రీధర్‌బాబు చర్లపల్లి రైల్వేస్టేషన్ భవిష్యత్తులో రద్దీగా, హైదరాబాద్‌కు ముఖ్య స్టేషన్‌గా మారనున్నందున విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు తరహా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీనికి కేంద్రం ప్రభుత్వం తన వంతుగా గ్రాంటు మంజూరు చేసి సహకరించాలని కోరారు. ఆ బాధ్యత రాష్ట్రానిదే: కేంద్రమంత్రి కేంద్రం చర్లపల్లిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే టెర్మినల్‌ను నిర్మించి రాష్ట్రానికి కానుకగా ఇచ్చిందని, దానికి అప్రోచ్ రోడ్డు నిర్మించే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న స్పష్టం చేశారు. దీనికి సీఎం ఆమోదం తెలిపేలా నచ్చజెప్పాలని సూచించారు. కర్ణాటకలో కూడా అప్రోచ్ రోడ్డు నిర్మాణ బాధ్యత రాష్ట్రానిదేనని సీఎం సిద్ధరామయ్యకు చెప్పామని సోమన్న వివరించారు. కాగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను రూ.2 వేల కోట్లతో విమానాశ్రయాలో తరహాలో కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. -
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన పీఎం మోదీ
-
ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్
-
త్వరలోనే భారత్‌కు బుల్లెట్ ట్రైన్: మోదీ
Charlapalli Railway Station Terminal Inaugurate Updates..👉 చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..చర్లపల్లి రైల్వే టెర్మనల్తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.ప్రతీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోంది.నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నాం.మారుమూల ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యం.రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోంది.వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లును ప్రవేశపెట్టాం.త్వరలోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుంది.కోట్లాది మంది ప్రజలను వందే భారత్ రైళ్లు గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి.గడిచిన పదేళ్లలో 30వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను నిర్మించాం.భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాం. #WATCH | Prime Minister Narendra Modi says, "...Our country has now over 1000 km of metro network... The projects that have been inaugurated today - for Telangana, Odisha and Jammu & Kashmir - it's a huge milestone in connectivity. It shows that the country is moving ahead… pic.twitter.com/Nyu2SIa224— ANI (@ANI) January 6, 2025 👉 రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ, సీఎం రేవంత్. #WATCH | PM Narendra Modi inaugurates and lays the foundation stone of multiple railway projects, virtuallyThe PM inaugurates New Jammu Railway Division, Charlapalli New Terminal Station in Telangana and lays the foundation stone for the Rayagada Railway Division Building of… pic.twitter.com/0bGiOhwfj2— ANI (@ANI) January 6, 2025తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్..చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందిరైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలుబందర్ పోర్ట్ కు రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాతెలంగాణ లో డ్రైపోర్ట్ ఏర్పాటు కు ఉపయోగకరంగా ఉంటుందితెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉందిఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కి అనుమతి ఇవ్వాలిరీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందిరీజనల్ రైల్ అవసరం కూడా ఉందిరైల్ రింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నావికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.ప్రధాని కోరుకుంటున్న 5ట్రిలియన్ ఎకానమీ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలితెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందిడ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది1ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు మాకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కామెంట్స్..రైళ్ల ప్రమాదాలను నివారించే కవచ్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించారు.వందే భారత్‌తో రవాణా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు.రింగ్ రోడ్ దగ్గరలో ఉండడం వల్ల చర్లపల్లి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది.అద్భుతమైన చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వే, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్..2021 నుంచి చర్లపల్లి అభివృద్ది పనులు జరిగాయి.తెలంగాణకు ఏది కావాలన్నా కేంద్రం సహాయం అందించింది.చర్లపల్లి అభివృద్ది పనులపై నేను దాదాపు ఆరు సార్లు వచ్చి పర్యవేక్షించానుట్రాఫిక్ సమస్య లేకుండా ఈ స్టేషన్ అందుబాటులో ఉంటుంది.ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.చాలా రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయిఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఘట్ కేసర్ వరకు వెళ్తాయి.720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం1300 రైల్వే స్టేషన్ లు దేశ వ్యాప్తంగా అభివృద్ది జరుగుతుందితెలంగాణ లో సుమారు 40 స్టేషన్లు కేంద్రం ఆధునీకరణ చేస్తోంది.రైలు కూత వినిపించని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు వేసి రైళ్ల సౌకర్యం కల్పిస్తుంది.రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేలా కవచ్ తీసుకొచ్చాంతెలంగాణకు ఐదు వందే భారత్ రైళ్లు వచ్చాయివందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రాబోయే రోజుల్లో వస్తే..ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభం అవుతుందిలక్ష కోట్లతో జాతీయ రహదారి విస్తరిస్తున్నాంకాజీపేటలో రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి.ఎంఎంటీఎస్ రైళ్ల కోసం 1000 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అడిగాంమేము ఎన్నో సార్లు అడిగినా ఇవ్వలేదు.అయినప్పటికీ మేము ముందడుగు వేసి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయిఎంఎంటీఎస్ రైళ్లు యాదగిరి గుట్ట వరకు పొడిగించాం.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి.లక్షల మంది ప్రయాణీకులు యాదగిరిగుట్టకు వెళ్తారు.కాబట్టి ఎంఎంటీఎస్ రైళ్లు వేస్తే సమయం ఆదా అవుతుందికొమరవెల్లి స్టేషన్ కూడా కడుతున్నాం.చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రావాలంటే అప్రోచ్ రోడ్లు కావాలి.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలిగతంలో ఎన్నోసార్లు కేసీఆర్‌కు లేఖ రాసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇప్పుడున్న ప్రభుత్వమైనా అప్రోచ్ రోడ్లకు కృషి చేయండి.ట్రిపుల్ ఆర్ వస్తుంది.ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..మోదీ గొప్ప మనసుతో 400కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారుగత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్లో దుర్గంధంతో ఉండేవిఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారుఅన్ని రైల్వే లైన్లు ఎలక్ట్రికల్ చేసేలా కృషి చేస్తున్నారురైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారుచర్లపల్లి పారిశ్రామికవాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందిమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కావడం సంతోషంతెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని ఎన్నో ఏళ్లుగా అడిగాంమేము కూడా కేంద్రానికి సాకారం అందించాంఇప్పుడు ప్రారంభించనున్న ఈ టెర్మినల్ కు రైల్వే అప్రోచ్‌కు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాంకేంద్రం కూడా అవసరమైన నిధులు విడుదల చేయాలి.అప్రోచ్ రోడ్లు, ప్రయాణికుల సహకారం కోసం కేంద్రం కొంత సహకరించాలి.రైల్వే నెట్వర్క్ పెంచేలా సహకారం చేయాలి.కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్..గతంలో రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్స్ వెంట చెత్తాచెదారం నిండిపోయి కంపుకొట్టేదికానీ, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక రైల్వే స్టేషన్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్‌గా మారిపోయాయి.32వేల కోట్లు రైల్వే స్టేషన్లో అభివృద్ది చేసేందుకు కేంద్రం సహకరించింది.అమృత్ స్కీం కింద 2 వేల కోట్లు తెలంగాణలో ఉన్న స్టేషన్లు అభివృద్ది చేస్తున్నాం430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ది చేసింది.రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ది కలిసి పనిచేయాలి.👉కాసేపట్లో పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్‌బాబు, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.👉సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో చర్లపలి టర్మినల్ నిర్మించారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్ 28నే టెర్మినల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్‌కు చేరుకునే వీలుంది.ఆధునిక హంగులు.. సదుపాయాలు.. 👉ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. స్టేషన్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 9 ప్లాట్‌ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్బే తోపాటు కార్లు, బైక్‌లను నిలిపేందుకు విశాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఖైదీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో.. అభినందించిన అధికారులు!
కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలులో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. జైలులోని దాదాపు 2500 ఖైదీల కోసం సినిమాను జైలులోనే ప్రదర్శించడం విశేషం. ఈ అవకాశం కల్పించిన చర్లపల్లి జైలు అధికారులకు, పోలీస్ విభాగనికి చిత్రయూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఇలాంటి ఒక మంచి అనుభూతిని పొందుతానని కలలో కూడా ఊహించలేదని ధనరాజ్ అన్నారు.ఈ చిత్రం చూసి ఖైదీలు ఎమోషనల్ అయ్యారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ అధికారులు మమ్మల్ని అభినందించి ఎంకరేజ్ చేసినట్లు ధనరాజ్ తెలిపారు. రామం రాఘవం చిత్ర యూనిట్ ఇది మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఖైదీల హృదయాల్ని కదిలించిన రామం రాఘవం చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందని చిత్రబంద సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.For the first time ever, team #RamamRaghavam 🏹 arranged special Premiere show for Charlapalli Jail prisoners on Gandhi Jayanthi❤️Gratitude to Jail Superintendent #GowriRamachandram garu🤗#RR Coming Soon to theatres🤩@thondankani @DhanrajOffl @suneeltollywood @Mokksha06… pic.twitter.com/xAV27xzNy5— Dhanraj koranani (@DhanrajOffl) October 4, 2024 -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా..
కుషాయిగూడ: సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా షాట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం చర్లపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్‌రెడ్డినగర్ కాలనీకి చెందిన చెన్నమ్మ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో చెన్నమ్మ ఆమె భర్త బయటకు వెళ్లగా కొడుకు తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. చార్జింగ్ పెట్టిన చోట షాట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన అతడు బయటకు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకుంటున్నాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లోని బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి ఆదకుంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నాగిళ్ల బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు) -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, మేడ్చల్: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్‌ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్‌తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చదవండి: ట్రాఫిక్ చలానా తొందరగా కట్టేయండి.. పొడిగింపు లేదు -
హాస్టన్ గో కార్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హాస్టన్ గో కార్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం గో కార్టింగ్ రైడింగ్ చేస్తూ బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. దీంతో నిందితులపై 304 ఐపిసి సెక్షన్ తో పాటు, 51 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. (గో కార్టింగ్ ప్రమాదంపై కేసు నమోదు) లాక్డౌన్ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ జోన్‌కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ గతనెల 28న నిబంధనలకు విరుద్ధంగా నిర్వహకులు హాస్టన్ గో కార్టింగ్‌ను ప్రారంభించారు. గో కార్టింగ్ రైడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో శ్రీ వర్షిణి కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే సెల్ఫీ కోసం శ్రీ వర్షిణి హెల్మెట్ తీసే ప్రయత్నం చేయడంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయని, ఆమె కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిందని హాస్టన్ గో కార్టింగ్ జోన్ నిర్వాహకులు చెప్తున్నారు. (గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్
మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్లలోని భూమి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పూర్తి నిర్మానుష్యంగా పొదలు, బండరాళ్లతో ఉన్న ఈ ప్రాంతంలో హత్యలు కూడా జరిగాయి. రెండేళ్ల క్రితం చాందిని జైన్ అనే యువతి స్నేహితుడితో కలిసి పీజేఆర్ ఎన్క్లేవ్ పక్కనే ఉండే 100 సర్వే నంబర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వారి మధ్య గొడవ జరగడంతో స్నేహితుడు చాందిని జైన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అమీన్‌పూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గడ్డం ప్రవీణ్‌ను అతడి స్నేహితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం దీప్తిశ్రీనగర్ వద్దనున్న 101 సర్వే నంబర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారు. కవాడిగూడలో 10 నెలల క్రితం ఓ యువతిని నిర్మానుష్యంగా ఉన్న డీబీఆర్ మిల్లు పరిసరాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. డీబీఆర్ వెనక భాగంలో అర కిలోమీటర్ వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏం జరిగినా ఎవరికీ తెలియని పరిస్థితి. సాక్షి, హైదరాబాద్ : కొద్దిగా చీకటయితే చాలు అసాంఘిక శక్తులు వళ్లు విరుచుకుంటున్నాయి. జనసంచారం తగ్గుముఖం పట్టగానే జంతువులై స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను అనుసరిస్తూ.. మంచిగా నటిస్తూ అవకాశం దొరకబుచ్చుకుని సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. కంటపడిన వాళ్లు ‘ఆడ’వాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేదు. పసికూనల నుంచి వయోధికుల వరకు ఈ మృగాలు వెంటబడి వేటాడుతున్నాయి. ఎంతోమంది యువతులు మృగాళ్ల పశువాంఛకు సమిధలవుతున్నారు. ఇదంతా సాధారణ జనజీవనానికి దూరంగా ఉండే అడవుల్లో కాదు.. కొండలు, గుట్టల్లో కాదు.. నాలుగువందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర గల హైదరాబాద్ మహానగరంలోనే. అంతర్జాతీయ నగరంగా విల్లసిల్లే రాజధాని నగరంలో అనేక ప్రాంతాలు ఆటవికుల అడ్డాలుగా మారాయి. ఫ్లైఓవర్ క్రీనీడ, కాలనీ అంచుల్లోని కాలిబాట, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడితేనేం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రత కరవవుతోంది. ఫిర్యాదు చేస్తే గంటకు తప్ప స్పందించని పోలీసు యంత్రాంగం అనేకానేక విషాదాంతాలకు మౌనసాక్షిగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో మృగాళ్లు పంజా విసురుతున్నారంటే.. అత్యాధునిక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మనసున్న వారికి శరాలై తగులుతున్నాయి. నగరంలో విస్తరించిన అసాంఘిక శక్తుల అడ్డాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి : 28 నిమిషాల్లోనే చంపేశారు! ప్రమాదకర కొన్ని ప్రదేశాలు ► పంజాగుట్ట సమీపంలోని సాహెబ్‌నగర్‌లో వివాదాస్పదమైన హుడా లేఅవుట్లో అసాంఘిక పనులు నిత్యకృత్యం. అక్కడ మద్యం, వ్యభిచారం పరిపాటిగా మారింది. ► డివిజన్ మూసీ పరివాహిక ప్రాంతం కూడా అసాంఘిక శక్తులకు నెలవు. ► లింగోజిగూడలోని అధికారినగర్, కామేశ్వర్రావుకాలనీ, అమ్మవారి టెంపుల్ ఏరియా, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం ప్రాంతం రాత్రి వేళల్లో అసాంఘిక పనులు సాగుతున్నా పోలీసులు చర్యలు తీసుకున్నది లేదు. ► విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కొత్తపేట చౌరస్తాలోని వీఎంహోమ్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. రాత్రిళ్లు మందుబాబులు తప్పతాగి చిందులేస్తుంటారు. ప్రహరి కూలిపోవడంతో వెనుక నుంచి గ్రౌండ్‌లోని చెట్ల మధ్య కూర్చుని తాగుతూ పేకాడుతుంటారు. ► హెచ్ఎంటీ ప్రదేశం సుమారు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇందులో హత్యలు, దోపిడీలు, ఆత్యాచార సంఘటనలు అనేకం జరిగాయి. ఒక వైపు జీడిమెట్ల, మరోవైపు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ రాత్రిపూట ఇటు నుంచి ఒంటరిగా వెళ్లాలంటే సామాన్యులు సాహసించలేరు. ► కొంపల్లి కేటీఆర్ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని జంటలు ప్రేమ పేరుతో తిష్ట వేస్తున్నారు. వీరిని అనుసరించే వచ్చే అల్లరిమూకలు మిగతా యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక రాత్రి వేళల్లో ఈ ప్రాంతం వ్యభిచార కేంద్రంగా మారిపోతుంది. ఇక తాగుబోతుల ఆగడాలు ఎన్నో చెప్పడం కష్టం. ► వెన్సాయి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ ఖాళీగా ఉండడంతో రాత్రిళ్లు కొందరు మద్యం తాగి రెచ్చిపోతున్నారు. కార్టన్ల కొద్ది బీరు బాటిళ్లను తీసుకొచ్చి తాగాక వాటిని రోడ్ల మీదనే పగులగొడుతున్నారు. చర్లపల్లి, మధుసూదన్నగర్సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం ► బస్ భవన్ వెనక సైతం గల్లీల్లో ప్రమాదకమైన పరిస్థితులే ఉన్నాయి. అడిక్‌మెట్ ప్లైఓవర్ బ్రిడ్జి కింద పట్టాలపై పోకిరీలు అర్ధరాత్రి వరకు తమ చీకటి కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. ► రహమత్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు. ఇక్కడ మద్యం, గంజాయి తాగడం నిత్యకృత్యం. చుట్టూ చెట్లు, గుట్టలతో నిర్మానుష్యంగా ఉండడంతో వారికి అనువుగా మారింది. ► బ్రహ్మశంకర్ ఫేజ్–2 బస్తీకి వెళ్లే దారిలో వీధి దీపాలు లేక మహిళలు రాత్రి వేళల్లో తమ నివాసాలకు వెళ్లలంటే భయపడుతున్నారు. చుట్టూ గుట్టలు నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొందరు యువకులు మద్యం, గంజాయి తాగుతూ హంగామా సృష్టిస్తున్నారు. ► రామంతాపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో చీకటి పడగానే పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇక్కడి చిన్న చెరువు, నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్, రాజేంద్రనగర్ చౌరస్తా, చిన్న జెండా బస్తీ, బైపాస్ రోడ్డు, భగాయత్ మూసీ పరివాహక ప్రాంతాలు రాత్రి అవుతుండగానే పోకిరీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో వారిదే ఇష్టారాజ్యం. మద్యం తాగి పార్టీల పేరుతో చేసే హంగామాతో స్థానికులు అందోళన చెందుతున్నారు. ► రామంతాపూర్‌లోని కొన్ని బస్తీలలో బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. రామంతాపూర్ ప్రధాన రహదారిలోని చర్చి స్కూల్ నుంచి దూరదర్శన్ కేంద్రం వరకు ఆరు వైన్ షాపులు, ఆరు బార్లు ఉండటంతో రోడ్ల మీదే మందు బాబులు చెలరేగిపోతున్నారు. ఈ ప్రాంతంలో సామాన్యులు నడిచి వెళ్లేందుకు భయపడుతుంటారు. ఇక్కడి పరిస్థితి పోలీసులకు తెలిసినా మౌనంగా ఉంటారు. ► ఎస్పీఆర్హిల్స్ రిజర్వాయర్ ఆవరణలోనూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లు ఉండటంతో పేకాట, మద్యపానం సర్వసాధారణం. ► నాచారం బాబానగర్, దుర్గానగర్, ఎర్రకుంట చెరువు కట్ట, సీడీఎస్ బిల్డింగ్ వెనుకభాగం, దుర్గానగర్, బాబానగర్, పాతబడిన కెమికల్ కంపెనీలు తాగుబోతులకు, పోకిరీలకు అడ్డాలుగా ఉన్నాయి. ► నాగర్జుననగర్, హెచ్‌బీకాలనీ లక్ష్మీనగర్ కాలనీవాసులకు ఇక్కడి వైన్స్ షాపులతో సమ్యలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ► కూకట్‌పల్లిలోని బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే మహిళా కార్మికులపైనా వేధింపులు కానసాగుతున్నాయి. ఇక్కడ గతంలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు గొంతుకోసి చంపాడు. ► గూడ్స్‌షెడ్ రోడ్డులో మద్యం తాగిన లారీ డ్రైవర్లు, హమాలీలు ఒంటరిగా వెళ్లే మహిళలను వేధించడం నిత్యకృత్యమైంది. ఆలయ ఆవరణలో మద్యం బాటిళ్లు.. ► అడవిని తలపించేలా ఉండే నిమ్మ్మే మైదానంలో నిత్యం మద్యం, గంజాయి సేవిస్తుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికనగర్ బస్టాప్ పక్కన ఉన్న నిమ్స్‌మే మైదానంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పరిపాటిగా మారాయి. ► కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, భాగ్యనగర్‌కాలనీ, నిజాంపేట ప్రాంతంలో రాత్రి 10 దాటాక వ్యభిచారులు రోడ్లపైకి రావటంతో ప్రతిరోజూ ఏదో ఒక దుర్ఘటన జరుగుతోంది. ► చంపాపేట పరిధిలోని డీఎంఆర్ఎల్ చౌరస్తా నుంచి 2 కి.మీ పొడవున గాయత్రినగర్ చౌరస్తా వరకు అర్ధరాత్రి 12 నుంచి వందలాది ఇసుక లారీలు అక్రమంగా పార్క్ చేస్తారు. వీటి డ్రైవర్లు ఇక్కడే మద్యం తాగుతూ చిదులేస్తుంటారు. ► మల్లాపూర్, మల్లికార్జున్‌నగర్, జేఎన్యూఆర్ఎం కాలనీ, భవానీనగర్‌లో సాయంత్రం విద్యార్థులు ట్యూషన్ విడిచిపెట్టే సమయంలో కొంతమంది పోకిరీలు ద్విచక్ర వాహనాలపై వారిని భయపెడుతుంటారు. ఇక్కడి బెల్టుషాపుల కారణంగా తెల్లవారుజామున 5 గంటలకే మున్సిపల్ గ్రౌండ్ వద్ద తాగి తందానాలాడుతున్నారు. ► చర్లపల్లి, మధుసూదన్‌నగర్, వెంకట్రెడ్డినగర్కాలనీల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం పోకిరీలకు అడ్డాగా మారింది. చీకటి పడగానే కాలనీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి రావడం, మద్యం, గంజాయి తాగడం.. కొందరు అమ్మాయిలతో కలిసి విచ్చలవిడిగా ప్రవర్తించడం పరిపాటి. ఈ క్రమంలో దారి వెంట వెళ్లేవారితో ఘర్షణ పడటం, సమీప కాలనీల్లో ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. ► చిలుకానగర్ చౌరస్తా వైన్‌షాపుల వద్ద పోకిరీల ఆగడాలపై పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. నాగోల్ నుంచి శిల్పారామం వెళ్లే రోడ్డుపై వ్యభిచారుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చీకటి పడితే నిర్మానుష్యమయ్యే యాకుత్‌పురా రైల్వే ట్రాక్ రోడ్డు ► మన్సూరాబాద్ డివిజన్ పెద్దచెరువు, చిన్న చెరువు ప్రాంతాల్లో చీకటి పడగానే మందు బాబులదే రాజ్యం. నాగోలు పరిధి బండ్లగూడ చెరువు ప్రాంతం అసాంఘిక కార్యకలపాలకు అడ్డా. హయత్‌నగర్ ఆటోనగర్‌లో ఇసుక లారీల అడ్డా వెనుక ఖాళీ ప్రదేశం కూడా అంతే. ఇక్కడ రాత్రిపూట లారీ డ్రైవర్లు, కూలీలు మద్యం తాగుతూ అసాంఘిక పనులకు పాల్పడుతున్నారు. ► ఉప్పల్ బస్టాండ్ కమాన్ వద్ద ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిత్యం వ్యభిచారులు విటులను ఆకర్షిస్తుంటారు. వీరి చర్యలకు స్కూల్ పిల్లలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ► యాకుత్‌పురా రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ రోడ్డు, తలాబ్‌కట్ట రైల్వే ట్రాక్ రోడ్డు, గౌలిపురా మేకలమండి రోడ్లు చీకటి పడగానే నేరగాళ్లకు స్థావరాలవుతున్నాయి. తలాబ్‌కట్ట, యాకుత్‌పురా రైల్వే ట్రాక్ రోడ్డులో తరచు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో చీకటి పడగానే ద్విచక్ర వాహనదారులు మాత్రమే రాకపోకలు సాగిస్తుంటారు. వీధి దీపాలు సైతం సరిగా వెలగకపోవడంతో అసాంఘిక శక్తులకు చెలరేగుతున్నాయి. కొందరు మందుబాబులు ఈ ప్రాంతాల్లో తిష్టవేసి వెక్కిలి చేష్టలతో రాత్రి వేళల్లో స్థానికులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రాంతంలో సైతం రాత్రి వేళల్లో ఇబ్బందికరంగా ఉటోంది. పోకిరీలు రైల్వే స్టేషన్ సమీపంలో తిష్టవేసి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ► ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే రహదారి పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు భయపడతారు. పూర్తిగా చెట్లతో, నిర్మానుష్యంగా ఉన్న ఈ దారిలో ఇప్పటికే ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. దారి దోపిడీలు, దాడులు, హత్యలు జరిగాయి. ఈ రూట్లో రాత్రి పూట పోలీస్ గస్తీ పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు. అసాంఘిక శక్తులకు అడ్డా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ రహదారి ► జీడిమెట్ల పారిశ్రామికవాడలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయ సమీపంలో తాగుబోతుల ఆగడాలు అరికట్టేవారు లేదు. ఆహ్లాదకర వాతావరణం, కూర్చోవడానికి గద్దెలు, ఎవరూ రారన్న ధీమాతో మందుబాబులు ఇక్కడే తాగి గొడవలు పడుతుంటారు. ఈ రోడ్డు గుండానే మహిళ కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. పోలీస్ ఫెయిల్! సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ పోలీసు వ్యవస్థ తీరుపై విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. నేర నివారణ అంశాన్ని పక్కనబెట్టి నేర పరిశోధనకే ప్రాధాన్యత ఇస్తుండటంపై విమర్శలకు దారి తీసింది. శంషాబాద్ సమీపంలో డాక్టర్ ప్రియాంకారెడ్డి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు తమ పరిధి కాదని తిప్పిపంపడం, వేగంగా కార్యాచరణలో దిగడంలో విఫలమయ్యారని మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల బాధ్యత లేకనే.. డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురవడం పోలీస్ వ్యవస్థ విఫలమవ్వడంగానే భావించాలి. బంధువులు ఫిర్యాదు చేసిన వెంటనే సరైన రీతిలో స్పందించి ఉంటే కనీసం ప్రియాంక ప్రాణాలతోనైనా దొరికేది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవానికి పొంతన లేదని చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. – డాక్టర్ శ్వేతాశెట్టి, నేషనల్ విమెన్స్ పార్టీ ప్రెసిడెంట్ మద్యం వల్లే నేరాలు.. స్మార్ట్ ఫోన్లలో క్లిక్ దూరంలో ఉండే అశ్లీల వెబ్సైట్లు, ఎక్కడపడితే అక్కడ లభించే మద్యంతో సమాజంలో నేరాలను పెంచతున్నాయి. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండాలి. అదేవిధంగా మహిళలు సైతం తమ చుట్టూ ఉండే మప్పు నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. – అనూప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్ అప్రమత్తంగా ఉండాలి ఓ తల్లిగా చెప్పుతున్నా.. నాక్కూడా ఓ కూతురు ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఆడ పిల్లలకు మాత్రం రక్షణ దొరకడం లేదు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా అర్ధరాత్రి తర్వాత కూడా బయట తిరుగుతున్నారు. జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ లేట్‌నైట్‌లో నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లడం చాలా ప్రమాదం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అత్యవసర ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ చిరంజీవి, ఆర్థోపెడిక్ సర్జన్, సన్‌షైన్ ఆస్పత్రి ఫిర్యాదులకు ఒకే నెంబర్ ఉండాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం చదువు మాత్రమే చెప్పించడం కాదు.. చదువుతో పాటు కొంత సంస్కారం కూడా నేర్పించాలి. మానవ సంబంధాలు, సమాజంపై అవగాహన కల్పించాలి. ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే దొరికి పోతామనే భయం కల్పించినప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి. అంతే కాదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తమ రక్షణ కోసం ఏ ఫోన్ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలో కూడా చాలా మంది మహిళలకు తెలియదు. ఒక్కో సమస్యకు ఒక్కో నెంబర్ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. అనివార్యమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. అన్ని రకాల ఫిర్యాదులకు ఒకే నెంబర్ కేటాయించి, ఆ నెంబర్‌పై పనితీరుపై పిల్లలకు అవగాహన పెంచితే రక్షణ సులువవుతుంది. – డాక్టర్ మంజుల అనగాని, గైనకాలజిస్ట్ చదవండి : శంషాబాద్‌లో మరో ఘోరం అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్ ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే మరో ఘోరం : కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ -
ప్రాజెక్టులు పట్టాలెక్కేనా..!
సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ ప్రకటించినా రైల్వే కేటాయింపులపై మాత్రం ఉత్కంఠ అలాగే ఉండిపోయింది. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసినప్పటి నుంచి రైల్వేల్లో ఏ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయించారు.. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులేంటి.. అనే అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. రైల్వేలకు లభించిన కేటాయింపులు, నిధులు, తదితర అంశాలపై ‘పింక్ బుక్’లో ప్రవేశపెట్టే వరకు బడ్జెట్లో ఏముందో తెలియని పరిస్థితి. ప్రత్యేకించి దక్షిణ మధ్య రైల్వేలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించారో.. కొత్తగా చేసిన ప్రతిపాదనలేంటనేది కూడా తెలియని పరిస్థితి. నగరంలో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి, యాదాద్రి ప్రాజెక్టులపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. అలాగే చాలాకాలంగా షిరిడీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర నగరాలకు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా కొత్తగా రైళ్లను నడపాలనే డిమాండ్ ఉంది. అలాగే ఆరేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. తాజా బడ్జెట్ నేపథ్యంలో నగరంలోని పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా? లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. దక్షిణమధ్య రైల్వేకు ఏ మేరకు నిధులు కేటాయించారో, ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయో తెలియాలంటే మరో ఒకటి, రెండు రోజుల పాటు ఆగాల్సిందే. ప్రతిపాదనలకే యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల మారా>్గన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని మూడేళ్ల క్రితం ప్రతిపాదించారు. ఈ మేరకు సర్వే కూడా పూర్తయింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రతిరోజు హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభించనుంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు రూ.430 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం వాటా, రైల్వే 41 శాతం భరించాలి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుత బడ్జెట్లోనైనా కదలిక ఉంటుందా, నిధులు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. చర్లపల్లి ప్రాజెక్టు పెండింగే..! నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్‌ను 4వ టర్మినల్‌గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్లోనే ప్రతిపాదించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో ప్రణాళికను సైతం రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని గుర్తించారు. ఈ టర్మినల్ నిర్మిస్తే 10 ప్లాట్‌ఫామ్‌లతో ప్రతిరోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని లెక్కేశారు. విజయవాడ, కాజిపేట్ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి నుంచి మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. అన్ని విధాలుగా ఎంతో అనుకూలంగా ఉన్న ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో అసలు ఇదీ పూర్తవుతుందా.. లేదా అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది పింక్‌బుక్‌లోనే ఉంటుంది. 2013లో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ గతేడాది నుంచే దశలవారీగా వినియోగంలోకి తేవాలని భావించినా నిధుల కొరతతో పూర్తి కాలేదు. -
ఆటోను ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: చర్లపల్లిలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ టవర్ నిర్మాణం అడ్డగింత...ఉద్రిక్తత
కుషాయిగూడ: సెల్ టవర్ నిర్మాణం ఉద్రిక్తతకు దారితీసింది. చర్లపల్లి డివిజన్ రెడ్డికాలనీలో సెల్ టవర్ నిర్మించేందుకు ఒక సంస్థ పూనుకుంది. అయితే, కాలనీ వాసుల అభ్యర్థనతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా సదరు సెల్ టవర్ నిర్మాణ సంస్థ పోలీసుల సాయంతో మంగళవారం ఉదయం నిర్మాణ పనులు చేపట్టింది. కాలనీ వాసులు అడ్డుకోగా పోలీసులు వారిని వారించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం టవర్ ఏర్పాటు చేస్తున్న ఇంటికి అనుమతులు కూడా సక్రమంగా లేవని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. -
జనపథం-చర్లపల్లి
-
నకిలీ ఏసీబీ అధికారుల ఆటకట్టు
శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులమంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, బుల్లెట్, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన గోతల శ్రీనివాస్ (46) పెయింటింగ్ కాంట్రాక్టర్. బం జారాహిల్స్‌లోని ఎన్బీటీనగర్లో ఉం టున్నాడు. ఇతని స్నేహితుడు ఆలేటి కిరణ్ కిశోర్ అలియాస్ సుభాకర్(30) చర్లపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ సైనిక్‌పురిలో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏసీబీ అధికారుల అవతారం ఎత్తారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి.. డబ్బు వసూ లు చేస్తున్నారు. శ్రీనివాస్ 4 నెలల క్రితం బంజారాహిల్స్‌లో వాటర్ కనెక్షన్ కోసం వెళ్తే జాప్యం జరిగింది. దీంతో వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ హఫీజ్‌కు శ్రీనివాస్ ఫోన్ చేసి మీపై చాలా ఆరోపణలు ఉన్నాయని బెదిరించాడు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ మీతో మాట్లాడతాడని కిరణ్కిశోర్తో మాట్లాడించాడు. ‘నీపై చాలా ఆరోపణలున్నాయి.. మీ ఇద్దరూ తేల్చుకోండి’ అని అతను ఫోన్ పెట్టేశాడు. హఫీజ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. ఇదే తరహాలో నేరేడ్మెట్ వాటర్‌వర్క్స్ డీజీఎం ఉమాశంకర్ నుంచి రూ.5 వేలు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు, మెదక్ జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ గీత నుంచి రూ.లక్ష, పార్వతీపురం సబ్‌రిజిస్ట్రార్ నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. అదే విధంగా శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ రామకృష్ణారెడ్డిని రూ.2 లక్షలు, కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, రాజేంద్రనగర్ సీటీఓ కేఎల్ సుధాకర్, హైదర్‌నగర్ సీటీఓ వెంకటేశ్వరరావు, హైదర్‌నగర్ డీసీటీఓ నాగబాబును పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. అయితే వారు తమపై వచ్చిన ఆరోపణలు ఏమిటో చెప్పాలని కోరడంతో మళ్లీ వారిని సంప్రదించలేదు. ఈక్రమంలోనే ఈనెల 10న శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ డి.సురేందర్‌రెడ్డిని బెదిరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచన మేరకు సురేందర్‌రెడ్డి.. నకిలీ ఏసీబీ అధికారి శ్రీనివాస్‌కు డబ్బులు ఇస్తానని గచ్చిబౌలి మహారాజ హోటల్‌కు రావాలని కోరా డు. శ్రీనివాస్ సదరు అధికారి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుషాల్కర్, ఎస్ఐ ఎస్.రమేష్, శివకుమార్‌లతో పాటు చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చి న సమాచారంతో కిరణ్కిశోర్నూ అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ను గచ్చిబౌలిలోని ఓ దుకాణంలో ఖరీదు చేసినట్లు నిందితులు వెల్లడించారు. చందానగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్ఐలు ఉన్నారు.