త్వరలోనే భారత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌: మోదీ | PM Modi Inaugurate Charlapalli Railway Station Terminal Live Updates | Sakshi
Sakshi News home page

త్వరలోనే భారత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌: మోదీ

Published Mon, Jan 6 2025 11:06 AM | Last Updated on Mon, Jan 6 2025 1:40 PM

PM Modi Inaugurate Charlapalli Railway Station Terminal Live Updates

Charlapalli Railway Station Terminal  Inaugurate Updates..

👉 చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 

  • ఈ  సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..
  • చర్లపల్లి రైల్వే టెర్మనల్‌తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.
  • వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.
  • రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
  • ప్రతీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోంది.
  • నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నాం.
  • మారుమూల ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యం.
  • రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోంది.
  • వందే భారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్ రైళ్లును ప్రవేశపెట్టాం.
  • త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ కల సాకారం అవుతుంది.
  • కోట్లాది మంది ​ప్రజలను వందే భారత్‌ రైళ్లు గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి.
  • గడిచిన పదేళ్లలో 30వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను నిర్మించాం.
  • భారత రైల్వేలకు బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేస్తున్నాం.
     

      

👉 రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ‌, సీఎం రేవంత్‌. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్‌..

  • చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది
  • రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు
  • బందర్ పోర్ట్ కు రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా
  • తెలంగాణ లో డ్రైపోర్ట్ ఏర్పాటు కు ఉపయోగకరంగా ఉంటుంది
  • తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంది
  • ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కి అనుమతి ఇవ్వాలి
  • రీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోంది
  • రీజనల్ రైల్ అవసరం కూడా ఉంది
  • రైల్ రింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా
  • వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.
  • ప్రధాని కోరుకుంటున్న 5ట్రిలియన్ ఎకానమీ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలి
  • తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుంది
  • డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది
  • 1ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు మాకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.  

 

 

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కామెంట్స్‌..

  • రైళ్ల ప్రమాదాలను నివారించే కవచ్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించారు.
  • వందే భారత్‌తో రవాణా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు.
  • రింగ్ రోడ్‌ దగ్గరలో ఉండడం వల్ల చర్లపల్లి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది.
  • అద్భుతమైన చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వే, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కామెంట్స్‌..

  • 2021 నుంచి చర్లపల్లి అభివృద్ది పనులు జరిగాయి.
  • తెలంగాణకు ఏది కావాలన్నా కేంద్రం సహాయం అందించింది.
  • చర్లపల్లి అభివృద్ది పనులపై నేను దాదాపు ఆరు సార్లు వచ్చి పర్యవేక్షించాను
  • ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ స్టేషన్ అందుబాటులో ఉంటుంది.
  • ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.
  • చాలా రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయి
  • ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఘట్ కేసర్ వరకు వెళ్తాయి.
  • 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం
  • 1300 రైల్వే స్టేషన్ లు దేశ వ్యాప్తంగా అభివృద్ది జరుగుతుంది
  • తెలంగాణ లో సుమారు 40 స్టేషన్లు కేంద్రం ఆధునీకరణ చేస్తోంది.
  • రైలు కూత వినిపించని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు వేసి రైళ్ల సౌకర్యం కల్పిస్తుంది.
  • రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేలా కవచ్ తీసుకొచ్చాం
  • తెలంగాణకు ఐదు వందే భారత్ రైళ్లు వచ్చాయి
  • వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రాబోయే రోజుల్లో వస్తే..
  • ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభం అవుతుంది
  • లక్ష కోట్లతో జాతీయ రహదారి విస్తరిస్తున్నాం
  • కాజీపేటలో రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి.
  • ఎంఎంటీఎస్ రైళ్ల కోసం 1000 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అడిగాం
  • మేము ఎన్నో సార్లు అడిగినా ఇవ్వలేదు.
  • అయినప్పటికీ మేము ముందడుగు వేసి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి
  • ఎంఎంటీఎస్ రైళ్లు యాదగిరి గుట్ట వరకు పొడిగించాం.
  • రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి.
  • లక్షల మంది ప్రయాణీకులు యాదగిరిగుట్టకు వెళ్తారు.
  • కాబట్టి ఎంఎంటీఎస్ రైళ్లు వేస్తే సమయం ఆదా అవుతుంది
  • కొమరవెల్లి స్టేషన్ కూడా కడుతున్నాం.
  • చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రావాలంటే అప్రోచ్ రోడ్లు కావాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి
  • గతంలో ఎన్నోసార్లు కేసీఆర్‌కు లేఖ రాసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
  • ఇప్పుడున్న ప్రభుత్వమైనా అప్రోచ్ రోడ్లకు కృషి చేయండి.
  • ట్రిపుల్ ఆర్ వస్తుంది.

ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..

  • మోదీ గొప్ప మనసుతో 400కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారు
  • గత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్‌లో దుర్గంధంతో ఉండేవి
  • ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారు
  • అన్ని రైల్వే లైన్లు ఎలక్ట్రికల్‌ చేసేలా కృషి చేస్తున్నారు
  • రైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారు
  • చర్లపల్లి పారిశ్రామికవాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..

  • చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కావడం సంతోషం
  • తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని ఎన్నో ఏళ్లుగా అడిగాం
  • మేము కూడా కేంద్రానికి సాకారం అందించాం
  • ఇప్పుడు ప్రారంభించనున్న ఈ టెర్మినల్ కు రైల్వే అప్రోచ్‌కు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం
  • కేంద్రం కూడా అవసరమైన నిధులు  విడుదల చేయాలి.
  • అప్రోచ్ రోడ్లు, ప్రయాణికుల సహకారం కోసం కేంద్రం కొంత సహకరించాలి.
  • రైల్వే నెట్‌వర్క్‌ పెంచేలా సహకారం చేయాలి.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్‌..

  • గతంలో రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్స్‌ వెంట చెత్తాచెదారం నిండిపోయి కంపుకొట్టేది
  • కానీ, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక రైల్వే స్టేషన్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్‌గా మారిపోయాయి.
  • 32వేల కోట్లు  రైల్వే స్టేషన్‌లో అభివృద్ది చేసేందుకు కేంద్రం సహకరించింది.
  • అమృత్ స్కీం కింద 2 వేల కోట్లు తెలంగాణలో ఉన్న స్టేషన్లు అభివృద్ది చేస్తున్నాం
  • 430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ది చేసింది.
  • రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ది కలిసి పనిచేయాలి.

👉కాసేపట్లో పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్‌బాబు, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.

👉సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో చర్లపలి టర్మినల్‌ నిర్మించారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌ 28నే టెర్మినల్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్‌కు చేరుకునే వీలుంది.

ఆధునిక హంగులు.. సదుపాయాలు.. 
👉ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. స్టేషన్‌లో ఆరు టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 9 ప్లాట్‌ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్‌ డిపోను కూడా నిర్మించారు. బస్‌బే తోపాటు కార్లు, బైక్‌లను నిలిపేందుకు విశాల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement