Trains cancel
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 52 రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే మొత్తం 52 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుండాలా- విజయవాడ సెక్షన్ పరిధిలో నాన్- ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి నెలాఖరు వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్- విశాఖపట్నం మార్గంలో ఉన్న జన్మభూమి, గరీబ్‌రథ్ కూడా ఉన్నాయి. Due to non-interlocking work in Gunadala – Vijayawada section, the following trains are cancelled, partially cancelled as follows: #2 pic.twitter.com/MnyFagV7Gx — South Central Railway (@SCRailwayIndia) August 21, 2023 Due to non-interlocking work in Gunadala – Vijayawada section, the following trains are cancelled, partially cancelled as follows: #1 pic.twitter.com/umNmQnw1ut — South Central Railway (@SCRailwayIndia) August 21, 2023 -
కాజీపేట స్టేషన్లో ట్రాక్‌పైకి వరద నీరు.. పలు రైళ్లు రద్దు!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తోంది. ఇదిలా ఉండగా.. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-ఖాజీపేట రూట్లో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు. సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్-తిరుపతి (12762), సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. Never seen #Kazipet Railway Station this way where tracks are filled with water up to 2 feet. #TelanganaRains #TelanganaFloods pic.twitter.com/OvGBA1EjLF — Krishnamurthy (@krishna0302) July 27, 2023 Bulletin No. 2 on "Cancellation/Diversion of Trains" @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada @GMSRailway pic.twitter.com/ejIpBmdQks — South Central Railway (@SCRailwayIndia) July 27, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం.. రంగంలోకి కేసీఆర్ -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 17 రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: చర్లపల్లి టెర్మినల్ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి వరంగల్, రేపల్లె, సిర్పూర్ కాగజ్గర్, కాచిగూడ నుంచి మిర్యాలగూడ, వికారాబాద్ నుంచి గుంటూరు మధ్య నడిచే పలు రైళ్లు రద్దు కానున్నాయి. విశాఖ–కాచిగూడ సూపర్ ఫాస్ట్ రైలు పొడిగింపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నం–కాచిగూడ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 20 నుంచి మహబూబ్‌నగర్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు కాచిగూడ–విశాఖ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12862) 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరుతుంది. 6.10కి కాచిగూడ చేరుకుని సాయంత్రం 6.20కి బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(12861) విశాఖలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.45కి కాచిగూడ చేరుకుంటుంది. తిరిగి 6.55కి బయల్దేరి ఉదయం 9.20 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. చదవండి: మండుతున్న సూరీడు.. ఆ జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత -
Agnipath Protest: అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లోనూ రైళ్లను ఆపివేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రైల్వే అధికారులు అల్లర్లు సద్దుమణిగిన తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని చెబుతున్నారు. చదవండి: (అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం) ఇదిలా ఉంటే, అగ్నిపథ్ నిరసన సెగ రైల్వే ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారడంతో పలు రైళ్ళు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. అగ్నిపథ్ ఆందోళనతో రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్లాట్ ఫామ్ పైకి ఎవ్వరిని రానివ్వకపోవడంతో స్టేషన్ బోసిపోగా, స్టేషన్ ముందు ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: హరియాణాలో జాట్ల ఆందోళనలతో వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం రాత్రి బయల్దేరాల్సిన హైదరాబాద్-హజరత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సోమవారం బయల్దేరే హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆదివారం బయల్దేరిన విశాఖపట్నం-కాజీపేట హజరత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట్‌లో నిలిపేశారు. -
రామగుండం మార్గంలో రైళ్ల రద్దు
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం మార్గంలో శనివారం ఆరు రైళ్లను రద్దు చేశారు. రామగుండం - రాఘవాపూరం మధ్య మూడో లైన్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే గేటును ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ పుష్పుల్, రామగిరి పాసింజర్, సింగరేణి పాసింజర్, నాగ్‌పూర్ పాసింజర్ రైళ్లను శనివారం రద్ధు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. -
చెన్నై-విజయవాడ మధ్య రైళ్లు రద్దు
సూళ్లూరుపేట: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల రైల్వే ట్రాక్ పైకి నీళ్లు రావడంతో చెన్నై-విజయవాడ మధ్య నడిచే అన్ని రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. సోమవారం ఉదయం ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. వాయుగుండం కారణంగా నెల్లూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. అటు ప్రకాశం జిల్లాలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. -
నిర్మాణ పనుల దృష్ట్యా పలు రైళ్లు రద్దు
హైదరాబాద్: దివిటిపల్లి-మహబూబ్‌నగర్ స్టేషన్ల మధ్య నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు పలు రైళ్లు పాక్షికంగా, కొన్ని పూర్తిగా రద్దు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బోధన్-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ దివిటిపల్లి-మహబూబ్‌నగర్ మధ్య రద్దవుతుంది. అది తిరుగు ప్రయాణంలో దివిటిపల్లి-కాచిగూడ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు మహబూబ్‌నగర్-దివిటిపల్లి మధ్య రద్దవుతుంది. గుంతకల్-కాచిగూడ ప్యాసింజర్ డోన్-మహబూబ్‌నగర్ స్టేషన్ల మధ్య రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ సాయంత్రం 4.10 గంటలకు బదులు సాయంత్రం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.