నిర్మాణ పనుల దృష్ట్యా పలు రైళ్లు రద్దు | Trains cancelled due to construction in progress | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనుల దృష్ట్యా పలు రైళ్లు రద్దు

Published Thu, Jul 9 2015 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

Trains cancelled due to construction in progress

హైదరాబాద్: దివిటిపల్లి-మహబూబ్‌నగర్ స్టేషన్ల మధ్య నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు పలు రైళ్లు పాక్షికంగా, కొన్ని పూర్తిగా రద్దు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బోధన్-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ దివిటిపల్లి-మహబూబ్‌నగర్ మధ్య రద్దవుతుంది.

అది తిరుగు ప్రయాణంలో దివిటిపల్లి-కాచిగూడ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు మహబూబ్‌నగర్-దివిటిపల్లి మధ్య రద్దవుతుంది. గుంతకల్-కాచిగూడ ప్యాసింజర్ డోన్-మహబూబ్‌నగర్ స్టేషన్ల మధ్య రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ సాయంత్రం 4.10 గంటలకు బదులు సాయంత్రం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement