సాక్షి, హైదరాబాద్/విజయవాడ: చర్లపల్లి టెర్మినల్ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి వరంగల్, రేపల్లె, సిర్పూర్ కాగజ్‌గర్, కాచిగూడ నుంచి మిర్యాలగూడ, వికారాబాద్ నుంచి గుంటూరు మధ్య నడిచే పలు రైళ్లు రద్దు కానున్నాయి.
విశాఖ–కాచిగూడ సూపర్ ఫాస్ట్ రైలు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నం–కాచిగూడ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 20 నుంచి మహబూబ్‌నగర్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు కాచిగూడ–విశాఖ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12862) 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరుతుంది. 6.10కి కాచిగూడ చేరుకుని సాయంత్రం 6.20కి బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(12861) విశాఖలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.45కి కాచిగూడ చేరుకుంటుంది. తిరిగి 6.55కి బయల్దేరి ఉదయం 9.20 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది.
చదవండి: మండుతున్న సూరీడు.. ఆ జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
Comments
Please login to add a commentAdd a comment