సాక్షి, హన్మకొండ: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తోంది.
ఇదిలా ఉండగా.. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-ఖాజీపేట రూట్‌లో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు.
సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్-తిరుపతి (12762), సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Never seen #Kazipet Railway Station this way where tracks are filled with water up to 2 feet. #TelanganaRains #TelanganaFloods pic.twitter.com/OvGBA1EjLF
— Krishnamurthy (@krishna0302) July 27, 2023
Bulletin No. 2 on "Cancellation/Diversion of Trains" @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada @GMSRailway pic.twitter.com/ejIpBmdQks
— South Central Railway (@SCRailwayIndia) July 27, 2023
ఇది కూడా చదవండి: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం.. రంగంలోకి కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment