kazipet railway station
-
వచ్చే ఆగస్టుకల్లా కాజీపేట యూనిట్
సాక్షి, హైదరాబాద్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను వచ్చే ఆగస్ట్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌హెచ్‌బీ (లింక్‌హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు, ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏటా 600 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యంతో కాజీపేట యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గురువారం దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యుల సమావేశం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగింది.ఈ సందర్భంగా పలు పెండింగ్ సమస్యలను ఎంపీలు ప్రస్తావించారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదట్లో రూ.250 కోట్లతో కాజీపేట్‌లో ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, ప్రస్తుతం దానిని రూ.680 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు మూడువేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన 40 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.780 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ పునరాభివృద్ధి ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. 15 ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే దక్షిణమధ్య రైల్వేలో 15 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్లతో 2647 కి.మీ. రైల్వేలైన్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ. 17,862 కోట్ల అంచనాతో 1,447 కి.మీ. డబ్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్ కేంద్రంగానే అత్యధికంగా 5 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో భూమి లభించకపోవడం వల్ల ఎంఎంటీఎస్ రెండో దశతోపాటు పలు ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రూ.650 కోట్లతో రాయగిరి నుంచి యాదాద్రి వరకు 31 కి.మీ. వరకు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా చేపట్టనుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మించాలని ప్రతిపాదించిన రైల్రింగ్రోడ్డుకు సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యతల కోసం కసరత్తురానున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాధాన్యతలను లక్ష్యంగా చేసుకొని దక్షిణమధ్య రైల్వే నిర్వహించిన ఈ ఎంపీల సమావేశంలో తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, డీకే అరుణ, కడియం కావ్య, బలరాంనాయక్, రఘురాంరెడ్డితోపాటు సాగర్ ఈశ్వర్ ఖండ్రే (బీదర్), రాధాకృష్ణ దోడ్డమణి (కలబురిగి) పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు నత్తనడకన సాగుతున్నాయని, సకాలంలో పూర్తయ్యేలా గడువు విధించాలని ఈటల సూచించారు.ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్‌ల ను పునరుద్ధరించాలని రఘునందన్‌రెడ్డి కోరా రు. ఏటా రెండుసార్లు ఎంపీల సమావేశం పెట్టి సమస్యలపై చర్చించాలని సురేశ్‌రెడ్డి సూచించా రు. దేవరకద్ర, కౌకుంట్ల, జడ్చర్ల ప్రాంతాల్లోని ఆర్‌యూబీలు, ఆర్ఓబీలను సకాలంలో పూర్తి చేయాలని డీకే అరుణ కోరారు. కాజీపేట రైల్వే ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కలి్పంచాలని కడియం కావ్య కోరారు. ఎంపీల ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఉంటుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ చెప్పారు. 2023–24 ఆర్థిక ఏడాదిలో 141 మిలియన్ టన్నుల సరుకు రవాణాద్వారా అత్యధికంగా రూ.13,620 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
కాజీపేట స్టేషన్లో ట్రాక్‌పైకి వరద నీరు.. పలు రైళ్లు రద్దు!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తోంది. ఇదిలా ఉండగా.. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-ఖాజీపేట రూట్లో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు. సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్-తిరుపతి (12762), సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. Never seen #Kazipet Railway Station this way where tracks are filled with water up to 2 feet. #TelanganaRains #TelanganaFloods pic.twitter.com/OvGBA1EjLF — Krishnamurthy (@krishna0302) July 27, 2023 Bulletin No. 2 on "Cancellation/Diversion of Trains" @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada @GMSRailway pic.twitter.com/ejIpBmdQks — South Central Railway (@SCRailwayIndia) July 27, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం.. రంగంలోకి కేసీఆర్ -
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు.. 34 మంది బాలలు సికింద్రాబాద్‌కు
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్‌కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు -
మత్తు మందు ఇచ్చి దోపిడీ చేశారు
కాజీపేట రూరల్: యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ప్రయాణికులను దుండగులు దోపిడీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జీఆర్పీ ఎస్ఐ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన నితిన్‌జైన్, త్రిపురకు చెందిన రాహుల్, బిహార్‌కు చెందిన ప్రేమ్‌శంకర్, యూపీకి చెందిన బూరెఖాన్, కాన్పూర్‌కు చెందిన ఎండీ అబ్బాస్‌లు కర్ణాటకలో ప్రైవేట్ పనులు చేస్తున్నారు. ఆదివారం వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు యశ్వంత్‌పూర్ రైల్లో బయల్దేరారు. కోచ్‌లో ప్రయాణిస్తున్న కొందరు తోటి ప్రయాణికుల మాదిరిగా మాటలు కలిపి వారిని నమ్మించారు. ఈ క్రమంలో ధర్మవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత కూల్ డ్రింక్స్, బిస్కెట్లో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వగా ఆరుగురు వాటిని సేవించి స్పృహ తప్పారు. దీంతో వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ఫోన్లు, వాచీ, గోల్డు రింగులను దోచుకుని తర్వాత స్టేషన్లో దిగి పారిపోయారు. జీఆర్పీ పోలీసులు అప్రమత్తమై కాజీపేటకు రైలు రాగానే బాధితులు ఆరుగురుని దింపి వరంగల్ ఎంజీఎం ఆస్ప త్రికి తరలించి చికిత్స చేయించారు. స్పృహలోకి వచ్చిన వారు విషయం వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
రైలు నుంచి మహిళా టీటీఐ తోసివేత
కాజీపేట రూరల్ : పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో నుంచి మహిళా ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ (టీటీఐ)ని ప్రయాణికులు కోచ్‌లో నుంచి బయటికి తోసేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జంక్షన్లో జరిగింది. కాజీపేట జంక్షన్ రైల్వే కమర్షియల్ విభాగంలో టీటీఐగా పనిచేస్తున్న నీలిమ సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌క్లాస్–1 బోగిలోకి వెళ్లి టికెట్ తనిఖీ చేస్తుండగా.. కొందరు ప్రయాణికులు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్‌క్లాస్ కోచ్‌లోకి రావడంతో పరిశీలించి జరిమానా చెల్లించాలని చెప్పింది. అప్పటికే కోచ్ రద్దీగా ఉంది. టీటీఐ మాట వినిపించుకోకుండా వారు బయటికి తోసి వేయడంతో నీలిమ ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్ బోగి ప్రయాణికులు గమనించి బయటికి తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో ఆగింది. -
స్వైప్ రిజర్వేషన్
కాజీపేట రైల్వేస్టేషన్లో ప్రారంభం నగదు రహిత లావాదేవీల్లో ముందడుగు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి స్వైప్ మిషన్ ఈ–పాయింట్ సిస్టంను రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్ వైజర్ ఐఎస్ఆర్.మూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ స్వైప్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వీసా కార్డు, రూపే కార్డు, మ్యాస్ట్రో, మ్యాస్టర్ డెబిట్ కార్డులు ఇందులో స్వైప్ చేయవచ్చని, ఈ సౌకర్యం కేవలం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికుల మాత్రమేనని తెలిపారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్లలో ఈ స్వైప్ సర్వీస్ విధానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సజ్జన్‌లాల్, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త రైలు వచ్చింది!
కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉదయం కొత్త రైలు వచ్చింది! అయితే, ఆ రైలు ఇక్కడ ఆగదు.. కనీసం మన జిల్లా మీదుగా వెళ్లదు కూడా!! చెన్నై పెరంబుదూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో తయారైన ఈ లోకల్ రైలు కాజీపేట టౌన్ స్టేషన్ మీదుగా ఉత్తర భారతానికి వెళ్లే క్రమంలో కాసేపు ఆగింది. 12 బోగీలతో ఉన్న ఈ రైలు అన్ని డబ్బాలకు ఆకట్టుకునేలా రంగులు, మహిళలకు ప్రత్యేక బోగీ ఉన్నాయి. డ్రైవర్, గార్డు మారేందుకు(క్రూ చేంజింగ్) కాజీపేట టౌన్లో ఈ రైలును ఆపగా స్థానికులతో పాటు ఫాతిమానగర్ బ్జ్రిడి మీదుగా వెళ్తున్న వాహనదారులు పలువురు ఆసక్తిగా తిలకించారు. – కాజీపేట రూరల్ -
కాజీపేట రైల్వేట్రాక్‌పై మృతదేహం
వరంగల్ : కాజీపేట రైల్వేట్రాక్‌పై మహిళా మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. అందులోభాగంగా మృతురాలు సుబేదార్కు చెందిన స్వర్ణలతగా గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భర్త మహేందర్ వరకట్న వేధింపుల వల్లే చనిపోయిందంటూ స్వర్ణలత బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. -
ఖాజీపేటలో 14.7 కిలోల బంగారం స్వాధీనం