కొత్త రైలు వచ్చింది!
కొత్త రైలు వచ్చింది!
Published Fri, Aug 5 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉదయం కొత్త రైలు వచ్చింది! అయితే, ఆ రైలు ఇక్కడ ఆగదు.. కనీసం మన జిల్లా మీదుగా వెళ్లదు కూడా!! చెన్నై పెరంబుదూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో తయారైన ఈ లోకల్ రైలు కాజీపేట టౌన్ స్టేషన్ మీదుగా ఉత్తర భారతానికి వెళ్లే క్రమంలో కాసేపు ఆగింది. 12 బోగీలతో ఉన్న ఈ రైలు అన్ని డబ్బాలకు ఆకట్టుకునేలా రంగులు, మహిళలకు ప్రత్యేక బోగీ ఉన్నాయి. డ్రైవర్, గార్డు మారేందుకు(క్రూ చేంజింగ్) కాజీపేట టౌన్‌లో ఈ రైలును ఆపగా స్థానికులతో పాటు ఫాతిమానగర్ బ్జ్రిడి మీదుగా వెళ్తున్న వాహనదారులు పలువురు ఆసక్తిగా తిలకించారు.
– కాజీపేట రూరల్
Advertisement
Advertisement