
సాక్షి, భూపాలపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మోరంచపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రి పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి బాధలను విన్నారు. అధిక వర్షాల వల్ల వరదలతో అనేక గ్రామాలు నీటమునిగిపోగా.. ఇళ్ళు రోడ్లు దెబ్బతిన్నాయి. పంటపొలాలు వరదలో కొట్టుకుపోయాయి.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు ఉన్నాయన్నారు. ఆ నిధులతో బాధితులను అన్ని విధాల ఆదుకోవాలన్నారు. మృతులకు ఇచ్చే రూ.4 లక్షల ఎక్సిగ్రేషియాలో 75 శాతం(3 లక్షలు) కేంద్రం ఇచ్చివేనని తెలిపారు. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్లిష్టపరిస్థితిలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. బాధితులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని తెలిపారు. కేంద్ర బృందాలు వరదముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తాయని చెప్పారు,.
కోలుకోని మోరంచపల్లి
ర్షాలు తగ్గినా మోరంచపల్లి ఇంకా కోలుకోలేదు. రెండు రోజుల నుంచి వరద బురదలోనే మోరంచపల్లి వాసులు కాలం గడుపుతున్నారు.అధిక వర్షాల వల్ల వరదలతో అనేక గ్రామాలు నీటమునిగాయి. ఇళ్ళు రోడ్లు దెబ్బతిన్నాయి. పంటపొలాలు వరదలో కొట్టుకుపోయాయిబురదను కడుక్కుంటూ సాయం కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు మోరంచపల్లిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంటింటా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇక వర్షాలకు గల్లంతైన వజ్రమ్మ, మహాలక్ష్మీల ఆచూకీ ఇంకా లభించలేదు.
తెలంగాణకు కేంద్ర బృందం
సోమవారం తెలంగాణకు కేంద్ర బృందం రానుంది. తెలంగాణలో వరద నష్టం అంచనా వేయనుంది. మొత్తం 8 శాఖల అధికారులతో తెలంగాణ కేంద్ర బృందం రానుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో కేంద్ర అధికారుల బృందం.. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర అధికారుల బృందంలో ఆర్థిక, వ్యవసాయ, జలశక్తి, విద్యుత్,రోడ్డు రవాణా, స్పేస్ డిపార్ట్‌మెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment