South Central Railway Cancel Few Trains - Sakshi
Sakshi News home page

జన్మభూమి, గరీబ్‌రథ్‌ సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 52 రైళ్లు రద్దు

Published Mon, Aug 21 2023 7:51 PM | Last Updated on Mon, Aug 21 2023 8:44 PM

South Central Railway Cancel Few Trains Updates  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే మొత్తం 52 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గుండాలా- విజయవాడ సెక్షన్‌ పరిధిలో నాన్‌- ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి నెలాఖరు వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్‌- విశాఖపట్నం మార్గంలో ఉన్న జన్మభూమి, గరీబ్‌రథ్‌ కూడా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement