సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లోనూ రైళ్లను ఆపివేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రైల్వే అధికారులు అల్లర్లు సద్దుమణిగిన తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని చెబుతున్నారు.
చదవండి: (అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం)
ఇదిలా ఉంటే, అగ్నిపథ్ నిరసన సెగ రైల్వే ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారడంతో పలు రైళ్ళు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. అగ్నిపథ్ ఆందోళనతో రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్లాట్ ఫామ్ పైకి ఎవ్వరిని రానివ్వకపోవడంతో స్టేషన్ బోసిపోగా, స్టేషన్ ముందు ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment