
చెన్నై-విజయవాడ మధ్య రైళ్లు రద్దు
సూళ్లూరుపేట: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల రైల్వే ట్రాక్ పైకి నీళ్లు రావడంతో చెన్నై-విజయవాడ మధ్య నడిచే అన్ని రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. సోమవారం ఉదయం ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. వాయుగుండం కారణంగా నెల్లూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. అటు ప్రకాశం జిల్లాలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.