అందుకే చెప్పకుండా వచ్చేశా.. మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం | Meerpet Missing Boy Found In Tirupati | Sakshi
Sakshi News home page

అందుకే చెప్పకుండా వచ్చేశా.. మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం

Published Tue, Aug 6 2024 10:58 AM | Last Updated on Tue, Aug 6 2024 12:01 PM

Meerpet Missing Boy Found In Tirupati

సాక్షి, తిరుపతి: హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో అదృశ్యమైన బాలుడిని  తిరుపతి రైల్వేస్టేషన్‌లో  గుర్తించారు. బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో ఫుటేజ్‌ ద్వారా లభ్యమైంది. బాలుడిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బంధువులు తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం మీర్‌పేట్‌లో ట్యూషన్‌కు వెళ్లి బాలుడు కనిపించకపోయిన సంగతి తెలిసిందే.

ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని.. తిరుమల నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడానని బాలుడు తెలిపాడు. ఆ బాలుడిని చైల్డ్ హోంకు తరలించిన పోలీసులు.. కర్నూలు నుంచి మేనమామ వస్తున్నాడని.. ఆయనకు అప్పగిస్తామని తెలిపారు.

జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్‌ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్‌ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్‌ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్‌ అడిగి మీర్‌పేట్‌ బస్టాండ్‌ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్‌ కాలేజీ బస్‌లో మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్‌ తీసుకుని రైలు ఎక్కాడు.  

ముందుగా కిడ్నాప్‌ అనుకుని.. 
ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్‌ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్‌ అడిగి.. బస్‌ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్‌ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించా.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement