missing boy safe
-
అందుకే చెప్పకుండా వచ్చేశా.. మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం
సాక్షి, తిరుపతి: హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడిని తిరుపతి రైల్వేస్టేషన్లో గుర్తించారు. బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ మలక్‌పేట రైల్వేస్టేషన్లో ఫుటేజ్ ద్వారా లభ్యమైంది. బాలుడిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బంధువులు తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం మీర్పేట్లో ట్యూషన్‌కు వెళ్లి బాలుడు కనిపించకపోయిన సంగతి తెలిసిందే.ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని.. తిరుమల నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడానని బాలుడు తెలిపాడు. ఆ బాలుడిని చైల్డ్ హోంకు తరలించిన పోలీసులు.. కర్నూలు నుంచి మేనమామ వస్తున్నాడని.. ఆయనకు అప్పగిస్తామని తెలిపారు.జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించా.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
కాళ్లతో తన్నారు.. కరెంట్ షాక్ పెట్టారు
అగర్తలా: చైనా భూభాగంలో గల్లంతైన భారతీయ బాలుడు మిరమ్ తరోన్.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరిగి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటిదాకా బంధీగా ఉంచుకుని.. అప్పగించే ముందు తమ కొడుకును చైనా సైన్యం చిత్ర హింసలు పెట్టిందని బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. చైనా సైనికులు మిరమ్ తరోన్‌ను చాలాసార్లు తన్నారని, రెండుసార్లు కరెంట్ షాకిచ్చారని తండ్రి ఓపాంగ్ తరోన్ ఆరోపించారు. కుమారుడి రాక సంతోషాన్నిచ్చిందని, కానీ మిరామ్‌ను చైనా బాధించిందని ఆ పేద రైతు వాపోయారు. చైనా భూభాగంలోకి వచ్చినట్లు గమనించి తప్పించుకోవడానికి మిరమ్ యత్నించాడని, కానీ చైనా సైనికులు పట్టుకొని హింసించారని ఓపాంగ్ చెప్పారు. అనంతరం మిరమ్‌ను బంధించి టిబెట్ భాషలో ప్రశ్నించారని, వారి భాష అర్థం కాక తన కుమారుడు సరైన సమాధానమివ్వకపోవడంతో కరెంటు షాకులిచ్చారని తెలిపారు. ఎప్పుడైతే మిరమ్ మిస్సింగ్ వార్త మీడియాలో వచ్చిందో.. ఆపై హింసించడం మానుకున్నారన్నారు. ఇప్పటికీ తన కుమారుడు చాలా బాధను అనుభవిస్తున్నాడన్నారు. మిరమ్‌కు చికిత్సనందిస్తామని భారత ఆర్మీ అభయం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 18న మిరమ్ తరోన్ కనిపించకుండా పోయాడు. దీనిపై భారతీయ ఆర్మీ వెంటనే స్పందించి ఆచూకీ కనిపెట్టమని చైనా ఆర్మీని కోరింది. అనంతరం తమ బంధీగా ఉన్న మిరమ్‌ను.. పలు చర్చల అనంతరం జనవరి 27న చైనా ఆర్మీ మిరామ్‌ను భారత్‌కు అప్పగించింది. సంబంధిత వార్త: మిస్సింగ్’ మిరమ్ తరోన్ దొరికాడు! చైనా ఆర్మీ ప్రకటన -
పోలీసులైతే నాకేం భయం!
సాక్షి, కుత్బుల్లాపూర్: ‘‘అమ్మా... నేను.. అక్క.. ముగ్గురం ఆటోలో వచ్చాం.. వాళ్లు కనిపించడం లేదు’’ అంటూ వచ్చీరాని మాటలతో తప్పిపోయిన ఓ బాలుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సందడి చేశాడు. తాత పేరు గోవర్ధన్ రావు అని, ఎల్కేజీ చదువుతున్నానని సీఐ రమేష్‌తో మాట కలిపాడు. చివరకు తప్పిపోయిన బాలుడి ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడి తాతయ్య అతడిని చూసి అవాక్కయ్యాడు. కుత్బుల్లాపూర్ కొంపల్లి బ్యాంక్ కాలనీలో గోవర్ధన్ రావు తన మనవడితో కలిసి ఉంటున్నాడు. ఉదయం ఆరు బయట ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు కేవీఆర్ గార్డెన్ ముందు ఏడుస్తూ కనిపించాడు. స్థానికులు డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎటువంటి భయం లేకుండానే సీఐ రమేష్‌తో వచ్చీరాని మాటలతో ఆ బాలుడు మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. చివరికి తాతయ్య రావడంతో అతనికి అప్పగించారు. చదవండి: కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకు.. -
అమ్మ ఒడికి చేరిన బాలుడు
బంజారాహిల్స్:సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఖైరతాబాద్ సమీపంలోని చింతల్‌బస్తీ ప్రేమ్‌నగర్‌లో నివాసముండే అపర్ణ, రంజిత్‌కుమార్ దంపతుల కొడుకు అంకిత్‌కుమార్ ఈ నెల 20న మెహిదీపట్నం రైతుబజార్ వద్ద కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. 29న ‘ప్రేమ్‌నగర్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం’ శీర్షికన ‘సాక్షి’లో అంకిత్ ఫొటోతో సహా వార్త ప్రచురితమైంది. షేక్‌పేట దర్గా సమీపంలో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన బాలుడి ఫొటోను చూసిన ఓ వ్యక్తి గడిచిన నాలుగైదు రోజులుగా అదే ప్రాంతంలో ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించాడు. అదే విషయాన్ని సోమవారం రాత్రి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి షేక్‌పేట దర్గాలోనే ఓ ఇంట్లో బంధీగా ఉన్న బాలుడిని గుర్తించారు. ఆరా తీయగా ఇదే ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ గదిలో బంధించినట్లు తెలుసుకున్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాలుడికి విముక్తి కలిగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులకు బాలుడిని క్షేమ సమాచారం అందించారు. ఆనందం పట్టలేని తల్లి అపర్ణ కుటుంబ సభ్యులతో కలిసి అదే రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును కళ్లారా చూసుకొని కన్నీరుమున్నీరైంది. అయితే ఎందుకోసం కిడ్నాప్ చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలుడి తల్లిదండ్రలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
అదృశ్యమైన చిన్నారి కథ సుఖాంతం..
విశాఖపట్నం: విశాఖలో అదృశ్యమైన 11 నెలల చిన్నారి నవదీప్ కథ సుఖాంతమైంది. శనివారం అర్థరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని వారి ఇంటి సమీపంలో వదిలివెళ్లారు. చిన్నారిని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో నవదీప్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులు చిన్నారి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.