విశాఖలో అదృశ్యమైన 11 నెలల చిన్నారి నవదీప్ కథ సుఖాంతమైంది.
విశాఖపట్నం: విశాఖలో అదృశ్యమైన 11 నెలల చిన్నారి నవదీప్ కథ సుఖాంతమైంది. శనివారం అర్థరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని వారి ఇంటి సమీపంలో వదిలివెళ్లారు.
చిన్నారిని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో నవదీప్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులు చిన్నారి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.