
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన విద్యార్థి ధనుష్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో ఉన్న పొదల్లో కొన ఊపిరితో ఉన్న ధనుష్‌ను పోలీసులు గుర్తించారు. తలకు బలమైన గాయం కావడంతో కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధనుష్ చిన్నాన్నతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గురువారం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని అపహరించి హత్య చేసేందుకే తలపై కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment