yeleswaram
-
ఏలేశ్వరం–విశాఖ నీళ్ల పైప్‌లైన్‌కు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తాగునీరు అందించడానికి చేపట్టిన ఏలేశ్వరం–విశాఖ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడుగు ముందుకుపడింది. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీలో భాగంగా డ్రోన్ సర్వేకి సన్నాహాలు మొదలయ్యాయి. ఏలేశ్వరం నుంచి విశాఖకు సుమారు 130 కిలోమీటర్లు పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో మూడు నదుల్లోంచి పైప్‌లైన్ నిర్మించాల్సి ఉండటం అత్యంత కీలకమైన అంశం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కాంట్రాక్టును దక్కించుకున్న వ్యాప్కోస్ డ్రోన్ సర్వే బాధ్యతను ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌కు అప్పగించింది. సర్వేకు సంబంధించిన సామగ్రి ఏలేశ్వరం చేరుకుందని, సర్వే కోసం ప్రాథమిక పనులు జరుగుతున్నాయని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈవో రవీంద్రరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 15 రోజుల్లో డ్రోన్ సర్వే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2050 వరకు తాగునీటి కొరత లేకుండా వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఏలేశ్వరం నుంచి విశాఖకు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పైపులైను ద్వారా రోజుకు 300 క్యూసెక్కుల నీటిని విశాఖకు తరలిస్తారు. తొలుత పోలవరం నుంచి ఈ పైప్‌లైన్ నిర్మించాలని భావించినా ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. పోలవరం నుంచి విశాఖకు 180 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఏలేశ్వరం నుంచి చేపట్టడం ద్వారా 50 కిలోమీటర్లు తగ్గడంతో నిర్మాణ వ్యయం రూ.1,000 కోట్లు తగ్గుతుందని లెక్కించారు. కాలువల ద్వారా నీటిని తరలిస్తే ఆవిరైపోవడం, ఆ నీటిని ఇతర అవసరాలకు కూడా వినియోగించే అవకాశం ఉండటంతో కేవలం తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. -
జన సైనికుడి ఘరానా మోసం
-
జన సైనికుడి ఘరానా మోసం
-
జన సైనికుడి ఘరానా మోసం
సాక్షి, ప్రత్తిపాడు: తమను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్లో ఆటో కార్మికులు శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. గణేష్ మాటలు నమ్మి రూ.లక్ష ఇరవై వేలు చొప్పున చెల్లించి ఫైనాన్స్ కంపెనీల నుండి డ్రైవర్లు ఆటోలు కొనుగోలు చేశారు. మామిడాడలో శరకణం గణేష్ పెట్టిన ప్లెక్సీ బాధితులు చెల్లించిన సొమ్ములతో జన సైనికుడు గణేష్ ఉడాయించాడు. ఈఎంఐలు చెల్లించాలని ఆటో ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిళ్ళు రావడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు గణేష్ చేసిన అన్యాయంపై ఆందోళనకు దిగారు. గణేష్‌తో పాటు ఆటో ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గృహ నిర్మాణాలకు కూడా సబ్సిడీ వస్తుందని సొమ్ములు వసూలు చేసినట్లు గణేష్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో అతడి మాటలు నమ్మి 200 మందిపైగా మోసపోయినట్టు తెలుస్తోంది. జనసేన పేరు చెప్పి తమను నిలువునా ముంచిన గణేష్‌ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి: బాధితులు జనసేన పార్టీ కార్యకర్త గణేష్ చేతిలో మోసపోయిన తమకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జనసేన పార్టీని చూసే తాము డబ్బులు కట్టామన్నారు. గణేష్‌తో పాటు జిల్లా నాయకులు వచ్చి తమను నమ్మించారని వాపోయారు. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని వెల్లడించారు. (చదవండి: పవన్ పర్యటనలో టీడీపీ నేతలు) -
ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన విద్యార్థి ధనుష్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో ఉన్న పొదల్లో కొన ఊపిరితో ఉన్న ధనుష్‌ను పోలీసులు గుర్తించారు. తలకు బలమైన గాయం కావడంతో కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధనుష్ చిన్నాన్నతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గురువారం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని అపహరించి హత్య చేసేందుకే తలపై కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి దుర్మరణం
ఇటీవలే బాధ్యతల స్వీకరణ ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : ఉన్నత చదువులు చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఉప్పలగుప్తం మండలానికి చెందిన ఓ యువకుడు తన ఆశలు తీరకుండానే మృత్యువాత పడ్డాడు. ఉద్యోగంలో చేరి నెల రోజులు కా కుండానే అసువులు బాశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన అవివాహితుడైన పశువైద్యాధికారి ఆకుల నాగభూషణంనాయుడు (29) రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో ఇటీవలే ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగిం చుకుని శనివారం తన స్వగ్రామానికి మోటారు బైక్‌పై బయలుదేరా డు. మార్గమధ్యంలో మండల పరిధి లోని జె.అన్నవరం సమీపంలోకి రాగానే ఎదురుగా వసున్న వ్యా¯ŒS ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేçహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసిన విద్యుత్ తీగ
విద్యుదాఘాతంతో కూలీ మృతి తూర్పులక్ష్మీపురం (ఏలేశ్వరం) : తెగిపడి ఉన్న విద్యుత్ తీగపై కాలు పెట్టడంతో ఓ కూలీ మరణించిన సంఘటన మంగళవారం తూర్పులక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పులక్ష్మీపురం గ్రామానికి చెందిన నక్కా సూరిబాబు(55) వ్యవసాయ కూలీ. అతడికి భార్య అన్నవరం, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇలాఉండగా మంగళవారం ఉదయం అతడి ఇంటి వద్ద విద్యుత్ స్తంభం నుంచి వీధిదీపాల తీగ తెగి పోయింది. ఇంటి నుంచి బయటకు వస్తున్న సూరిబాబు ఆ తీగను గమనించకుండా, కాలు పెట్టాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే చనిపోయాడు. కూలీ పనులు చేసుకుని జీవించే ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఎస్సై వై.రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీలో వర్గపోరు బహిర్గతం
ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముందు నుంచీ టీడీపీలో ఉన్న వారికి, ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వర్గీయులకు మధ్య వర్గపోరు తలెత్తింది. దీనికి తోడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వ్యవహరిస్తున్న తీరుపై దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు భగ్గుమం టున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ సమావేశం సాక్షిగా శనివారం టీడీపీ వర్గపోరు బహిర్గతమైంది. స్థానిక నగర పంచాయతీ కార్యాల యంలో చైర్పర్సన్ కొప్పాడ పార్వతి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమవుతుండగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. వారు కారణం చెప్పకపోవడంతో మిగిలిన కౌన్సిలర్లకు విషయం తెలియక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యేను సమావేశానికి పిలవకపోవడంతో వాకౌట్ చేసినట్టు వరుపుల వర్గానికి చెందిన కౌన్సిలర్లు తెలి పారు. ఎమ్మెల్యే ఇంటివద్ద అజెండా కాపీ ఇచ్చి ఆయన సతీమణి నుంచి సంతకం తీసుకున్న రశీదును మరో వర్గం వారు విలేకరులకు చూపిం చారు. టీడీపీ కేడర్ అంతా కలిసి పనిచేద్దామంటే కావాలనే గ్రూపు రాజకీయాలకు పాల్పపడుతున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను పాల్పపడితే తాము సత్తాచూపుతామని ప్రజలనుంచి తాము టీడీపీ తరఫున గెలిచామని, పార్టీ ఫిరాయించలేదని, ఒరిజినల్‌గా తమదే అసలైన టీడీపీయని మరో వర్గం చెబుతోంది. ఎమ్మెల్యే వరుపుల తీరుపై ఎంపీకి ఫిర్యాదు శంఖవరం: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైఖరిపై దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు ఎంపీ తోట నరసింహానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వరుపుల ఆది నుంచి పార్టీలో ఉంటున్నా తమ ఆధిపత్యాన్ని అణచివేసే చర్యలకు దిగుతున్నారని రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని పలువురు గ్రామస్థాయి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పర్వత వర్గీయు లు ఎంపీ తోట నరసింహాన్ని శనివారం రాత్రి శంఖవరం రప్పించుకుని రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా రౌతులపూడి మండలంలో గిడజాం, పల్లపుచామవరం గ్రామాల్లో గతంలో తొలగించిన ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లను ఎమ్మెల్యే వరుపుల తిరిగి నియామకం చేశారని ప్రధానంగా ఆరోపించినట్టు చెబుతున్నారు. బంగారయ్యపేట నుంచి ఎమ్మెల్యే వరుపుల ఇంటికి వెళ్లిన పూర్వపు టీడీపీ కార్యకర్తలు కొందరిని తనవద్దకు రావద్దు వెళ్లిపొమ్మన్నారనే విషయంపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంతేగాక ఉపాధి కూలీలకు ఇచ్చే మజ్జిగ కార్యక్రమాన్ని కూడా తన అనుయాయులకే కట్టబెట్టుకున్నారని ఆరోపించారని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పార్టీకి గుడ్‌బై చెప్పాల్సి వస్తోందని హెచ్చరించినట్టు తెలిసింది. దీనిపై ఎంపీ తోట పార్టీ అధిష్ఠానం సూచన మేరకు సమన్వయంతో పనులు సాగించుకోవాలని సూచించినట్టు తెలిసింది. గ్రామాల్లో అన్ని పనుల్నీ టీడీపీ కార్యకర్తలతో కలిసి చేసుకోమని ఎమ్మెల్యే వరుపుల తన అనుయాయులందరికీ చెబుతున్నారని, ఆ మేరకే అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారని వరుపుల వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో పొరపొచ్చాలు తీసుకు వచ్చేందుకు ఇలాంటి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ సమావేశానికి ఎంపీ తోట హాజరు కావడం చూస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని పలువురు నాయకులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని తోడికోడళ్లు మృతి
ఏలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా) : ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామం శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో తోడికోడళ్లు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్తిపాడు మండలం బమ్మంగి గ్రామానికి చెందిన అర్జున, ఆయన భార్య లక్ష్మి, ఆమె తోడికోడలు భవాని, ఆమె కుమారుడు జగన్‌కుమార్ ద్విచక్రవాహనంపై జగ్గంపేటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి, భవాని, జగన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆస్పత్రికి తరలించగా లక్ష్మి, భవానిలు మృతిచెందారు. జగన్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పీఎస్ ఎదుట మహిళ ధర్నా
ఏలేశ్వరం (తూర్పు గోదావరి జిల్లా) : అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ ఓ మహిళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అతణ్ణి అరెస్ట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగులమందు డబ్బా పట్టుకుని స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. నిందితుడు కళ్ల ముందే తిరుగుతున్నా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మరణంలోనూ వీడని స్నేహం
మృత్యువు సైతం ఆ మిత్రులను విడదీయలేకపోయింది. స్నేహితులైన ఆ ముగ్గురు జీవనోపాధి కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకు కొన్నేళ్ల క్రితమే వలస వచ్చారు. వారిలో సురేష్‌బాబురెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరి పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ పదవి చేపట్టారు. రావులపాలెంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం రాత్రి పలాస నుంచి కారులో బయలుదేరిన ఆ ముగ్గురిపై మృత్యువు పంజా విసిరింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని కారు నుజ్జునుజ్జయ్యింది. స్నేహబంధానికి ప్రతీకగా నిలిచిన వారు కలిసే మృత్యువు ఒడిలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎప్పుడో వలస వచ్చి శ్రీకాకుళం జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వీరు చివరికి తమ సొంత జిల్లాలోనే అకాల మరణం పాలవ్వడం విధి వైచిత్రికి నిదర్శనం. - ఏలేశ్వరం / మండపేట రూరల్ / పెదపూడి /పలాస, న్యూస్‌లైన్ :జీవిత ప్రస్థానంలో ఒకేమాటగా, ఒకేబాటగా ముందంజ వేసిన ఆ ముగ్గురు మిత్రులను మృత్యువు ఒక్కసారే కబళించింది. ఒకరికొకరు అండగా.. అంచెలంచెలుగా ఎదిగిన వారు అంతిమప్రస్థానంలోనూ ఒకరికొకరు తోడయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మండపేట మండలం అర్తమూరుకు చెందిన కడియాల శ్రీనివాస్ (39), పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన తమలంపూడి సురేష్‌బాబురెడ్డి(36), వెలగల నారాయణరెడ్డి(38) మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడ్డి పదేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లా పలాసకు వలస వెళ్లారు. అక్కడ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇటీవల హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించారు. వీరిలో సురేష్‌బాబురెడ్డి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రావులపాలెంలో బంధువుల ఇంట ఆదివారం జరిగే ఓ వేడుకలో పాల్గొనేందుకు శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడ్డితో పాటు పంచాయతీ రాజ్ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ టి.నరసింహమూర్తి శనివారం రాత్రి పలాస నుంచి కారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో చిన్నింపేట జంక్షన్ వద్ద వీరి కారును దాటుకుని వచ్చిన గుర్తు తెలియని వాహనం అకస్మాత్తుగా కుడివైపు తిరిగింది. దీంతో వీరి కారు ఆ వాహనాన్ని ఢీకొని నుజునుజ్జయింది. శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి అక్కడికక్కడే మరణించారు. నారాయణరెడ్డి, నరసింహమూర్తి, డ్రైవర్ ప్రసాద్‌కుమార్ మహంతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కారు లోంచి చేతులు బయటకు పెట్టి నరసింహమూర్తి చేస్తున్న ఆర్తనాదాలతో అక్కడకు చేరుకున్న స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య గౌరి, కుమారుడు చందు, కుమార్తె రోజ్ ఉన్నారు. నారాయణరెడ్డికి భార్య శాంతిప్రియ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై గౌరీశంకర్, ట్రైనింగ్ ఎస్సై శంకర్ పరిశీలించారు. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో నుజ్జయిన కారును గురైన వాహనాన్ని క్రేన్‌ద్వారా పక్కకు తొలిగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గొల్లలమామిడాడ, అర్తమూరు గ్రామాలకు తరలించారు. అర్తమూరు, మామిడాడ, పలాసలో విషాదం ఈ ఘటనతో అర్తమూరు, గొల్లలమామిడాడ, పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో విషాదం అలముకుంది. శ్రీనివాస్ మృతదేహానికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల రోదన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సురేష్‌బాబు రెడ్డి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, జయరామ్చంద్రారెడ్డి, హైదరాబాద్ నుంచి సోదరి సుధారాణి మామిడాడ చేరుకున్నారు. కుటుంబానికి పెద్దదిక్కైన కొడుకును మృత్యువు ప్రమాద రూపంలో పొట్టన పెట్టుకుందని వారు విలపించారు. నారాయణరెడ్డి భార్య, పిల్లలు పలాస నుంచి మామిడాడ బయలుదేరారు. కొడుకు, కోడలు, మనవలతో వస్తారనుకుంటే శవమై వచ్చాడని నారాయణరెడ్డి తండ్రి బోరున విలపించారు. -
లారీ, కారు ఢీ: ఇద్దరు వ్యక్తులు మృతి
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున లారీ-కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారులోని ప్రయాణికులు పలాస నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రచ్చబండ రసాభాస
ఏలేశ్వరం, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఆశయంతో రచ్చబండ ప్రవేశపెట్టా రో దానిని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడవడంతో అది రచ్చరచ్చగా మారుతోంది. కాం గ్రెస్ నాయకులు తమ స్వార్థప్రయోజనాలకు వాడుకుంటూ మోసం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలేశ్వరంలో నిర్వహించిన రచ్చబండను అడుగడుగునా అడ్డుకుంటూ తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు అధ్యక్షతన నిర్విహ ంచిన రచ్చబండ కు మండలంలోని పలు గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభపై ఎమ్మెల్యేతో పాటు మరో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, మాజీ ప్రజాప్రతినిధులు వరుపుల తమ్మయ్యబాబు, బొదిరెడ్డి గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్‌లు పైలసత్యనారాయణ, గారా చంద్రలీలావతి, రచ్చబండ కమిటీ సభ్యులంటూ కాంగ్రెస్ పార్టీ వారిని కూర్చోబెట్టడంతో రభస మొదలైంది. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శిడగం వెంకటేశ్వరరావు సభ వద్దకు చేరుకుని ప్రోట్‌కాల్ పాటించడం లేదని అధికారులను నిల దీశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, సహకార సంఘ అధ్యక్షుడిని సభపైకి పిలవకపోవడంపై అధికారులను నిలదీశారు. వైఎస్సార్ సీపీ నేత అలమండ చలమయ్య మాట్లాడు తూ గతంలో ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం ఈ రచ్చబండలోనైనా అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సభకు వచ్చిన అర్జీదారులు లేచి నిల బడడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. వైఎస్సార్ సీపీ నేతలు గొల్లపల్లి బుజ్జి, రాం దాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, అర్జీదారులు తమ అర్జీలను దహనం చేశారు. అనంతరం లబ్ధిదారులకు అనుమతి పత్రాలు ఇచ్చి ముగించారు. తహశీల్దార్ కె.ప్రకాశ్‌బాబు, ఎంపీడీఓ వి.రామకృష్ణ పాల్గొన్నారు.