60 గంటలు దాటినా దొరకని దీక్షిత్‌ ఆచూకీ | Mahabubabad Boy Kidnapping Case Still Mystery | Sakshi
Sakshi News home page

60 గంటలు దాటినా దొరకని దీక్షిత్‌ ఆచూకీ

Published Wed, Oct 21 2020 11:14 AM | Last Updated on Wed, Oct 21 2020 11:15 AM

Mahabubabad Boy Kidnapping Case Still Mystery - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో బాలుడి కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీక్షిత్‌ రెడ్డి కిడ్నాప్‌కి గురై 60 గంటలైనా బాలుడి ఆచూకీ లభ్యంకాలేదు. అయితే మంగళవారం రాత్రి కిడ్నాపర్లు ప్రైవేట్‌ నెంబర్‌తో మరోసారి ఫోన్‌ చేశారు. దీంతో కిడ్నాపర్లు పక్కాగా రెక్కీ నిర్వహించి బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్‌ బాలుడి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తే కావొచ్చని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కేసుకు సంబంధించిన విచారణ ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోంది.  (మానుకోటలో బాలుడి కిడ్నాప్)‌

కాగా.. అప్పటివరకు తండ్రితో కలిసి దసరా షాపింగ్‌ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్‌ కావడం సోమవారం జిల్లాలో కలకలం సృష్టించింది. మహబూబాబాద్‌కు చెందిన ఓ చానెల్‌ వీడియో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్‌ (9) ఆదివారం స్నేహితులతో ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎక్కించుకుని తీసుకెళ్లారు. బుధవారం ఉదయం వరకు బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement