కామారెడ్డి జిల్లా బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో లోకేష్(4) అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు.
సాక్షి, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో లోకేష్(4) అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ రోడ్డులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీసీ టీవీ కెమెరాల్లో మహిళలు చిన్నారిని తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు.