తిరుమలలో బాలుడి అపహరణ | Boy Kidnapped In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో బాలుడి అపహరణ

Published Tue, May 3 2022 5:15 AM | Last Updated on Tue, May 3 2022 7:04 AM

Boy Kidnapped In Tirumala - Sakshi

తప్పిపోయిన చిన్నారి చింటూ, చిన్నారిని తీసుకెళ్తున్న మహిళ

తిరుమల: తిరుమలలో ఓ బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించిన ఘటన సోమవారం వెలుగుచూసింది. తిరుమల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని దామినేడు, కొత్త ఇండ్లకు చెందిన చవ్వా వెంకటరమణ కుటుంసభ్యులతో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ఆయన కుమారుడు సి.గోవర్ధన్‌ రాయల్‌ అలియాస్‌ చింటూ (5) అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.

వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రంలో పరిశీలించగా ఆదివారం రాత్రి 7.11 గంటల సమయంలో ఓ మహిళ బాబును తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంది. గుండుతో ఉన్న ఈమెతో పాటు 4 నుంచి 5 సంవత్సరాల బాబును ఎవరైనా గుర్తిస్తే తిరుమల వన్‌టౌన్‌ పీఎస్‌ సీఐ ఫోన్‌ నంబర్‌ 9440796769కు లేదా తిరుమల టూటౌన్‌ పీఎస్‌ సీఐ సెల్‌ నంబర్‌ 9440796772కు సమాచారం అందించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement