Tirumala police
-
తిరుమలలో బాలుడి అపహరణ
తిరుమల: తిరుమలలో ఓ బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించిన ఘటన సోమవారం వెలుగుచూసింది. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని దామినేడు, కొత్త ఇండ్లకు చెందిన చవ్వా వెంకటరమణ కుటుంసభ్యులతో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ఆయన కుమారుడు సి.గోవర్ధన్ రాయల్ అలియాస్ చింటూ (5) అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రంలో పరిశీలించగా ఆదివారం రాత్రి 7.11 గంటల సమయంలో ఓ మహిళ బాబును తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంది. గుండుతో ఉన్న ఈమెతో పాటు 4 నుంచి 5 సంవత్సరాల బాబును ఎవరైనా గుర్తిస్తే తిరుమల వన్‌టౌన్ పీఎస్ సీఐ ఫోన్ నంబర్ 9440796769కు లేదా తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ సెల్ నంబర్ 9440796772కు సమాచారం అందించాలని కోరారు. -
శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తులను మోసగించిన నిందితుడిని తిరుమల టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రమేష్‌ల కథనం మేరకు.. భువనగిరికి చెందిన వెంకటేష్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని తిరుపతికి చెందిన నాగరాజు అనే దళారిని ఆశ్రయించాడు. తమ కుటుంబంలోని 11 మంది సభ్యులకు రూ.300 దర్శనం టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు నాగరాజు రూ.16,500 అవుతుందని తెలిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంకటేష్ మొదటి విడతగా ఫోన్‌పే ద్వారా రూ.8 వేలను నాగరాజుకు పంపాడు. అనంతరం తిరుపతికి చేరుకున్న వెంకటేష్‌కు టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరుతో గతంలో వచ్చిన మెసేజ్‌ను ఎడిట్ చేసి నకిలీ మెసేజ్‌ను పంపాడు నాగరాజు. సదరు మెసేజ్‌తో తిరుమలకు చేరుకున్న వెంకటేష్ చైర్మన్ కార్యాలయాల్లో సంప్రదించగా ఆ మేసేజ్ నకిలీదిగా తేలింది. దీంతో భక్తులు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నాగరాజును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని పోలీసులు సూచించారు. -
ఈ దొంగోడు..భలే టక్కరోడు.. ఒక్క బంగారు గాజే చాలు..!
తిరుమల : చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని బంగారు నగలు చోరీ చేసే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో తిరుమల అదనపు ఎస్పీమునిరామయ్య విలేకరులకు తెలిపిన వివరాలు.. కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన హంసపురం అనంతరాజు (34) గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది జూలై 27వ తేదీ వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో తిరుమలకు వచ్చేవాడు. అన్నదాన సత్రం ఏరియాలో భక్తుల చెంత నిద్రిస్తున్న చిన్నపిల్లల చేతిలోని విలువైన బంగారు గాజులను చోరీ చేసేవాడు. ప్రధానంగా చిన్నారుల రెండు చేతులకు బంగారు గాజులు ఉంటే ఒక గాజును మాత్రమే చోరీ చేసేవాడు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులు ఒక గాజును ఎక్కడైనా పడేసుకున్నారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కాదు. అయితే గతనెల 27న తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదుదారుడు ఒక బంగారు గాజు చోరీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసును నమోదు చేసిన స్టేషన్ సీఐ జగన్మోహన్రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడు హంసపురం అనంతరాజును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గాజును స్వా«దీనం చేసుకున్నారు. ఏడాది కాలంలో ఏడుసార్లు బంగారు గాజులను చోరీ చేశాడని, వాటిని తిరుపతిలోని ఓ కుదువ దుకాణంలో తాకట్టు పెట్టినట్లు తేలింది. ఆ దుకాణానికి పోలీసులు నోటీసు జారీ చేశారు. ఆ ఆభరణాలను స్వా«దీనం చేసుకుని బాధితులకు అందజేస్తామని సీఐ చెప్పారు. సమావేశంలో టీటీడీ వీజీఓ బాలిరెడ్డి, తిరుమల డీఎస్పీ ప్రభాకర్, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాలపై దుష్ప్రచారం చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన పలువురిపై టీటీడీ చేసిన ఫిర్యాదుల మేరకు తిరుమల టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ► టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ► తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్ ప్రచారం చేశారని తమిళ్‌మయ్యన్ అనే వ్యక్తి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ► తిరుమల శ్రీవారి ఆలయంలో 30–6–2020 వరకు భక్తులకు దర్శనం నిలిపివేస్తారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగర శివరాజు, way2news short news App నిర్వాహకులు తిరుపతి వార్త, గోదావరి న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు. ► https://www.face book.com/atheisttelugu/ అనే ఫేస్బుక్ పేజీలో 7–5–2020న తిరుమల శ్రీవారిపై అవాస్తవ సమాచారాన్ని పోస్టు చేశారు. ఒకానొక కాలంలో తిరుమల ఆలయం బౌద్ధారామం అని, తలనీలాల సమర్పణ హిందువుల సంప్రదాయం కాదని బౌద్ధులకు చెందిందని అందులో పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహంగా మార్చారని పొందుపరిచారు. ఈ పోస్టులో బుద్ధుని చిత్రం, బుద్ధుడి నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారిగా మార్చిన చిత్రం ఉన్నాయి. ఈ పోస్టు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
భక్తులను మోసం చేస్తున్న కార్తీక్ అరెస్ట్
సాక్షి, తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమలకు వచ్చే అమాయకపు భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫొన్ నంబర్లను ట్రాప్ చేసి.. వారికి దర్శనం చేయిస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన తిరుమల టుటౌన్ పోలీసులు తెనాలిలో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తిరుమల టుటౌన్ సీఐ వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ చెడు వ్యసనాలకు అలవాటుపడి తిరుమలకు వచ్చి కొంతమందితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత తిరుమలకు వచ్చే భక్తులను మోసగించడమే పనిగా పెట్టుకున్నాడు. కార్తీక్‌తో సంబంధం కలిగిన తిరుమలలోని లడ్డు దళారులు.. మఠంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామ’ని తెలిపారు. -
నకిలీ నోట్లున్నాయని..
- తిరుమల పోలీసుల అత్యుత్సాహం - నకిలీ నోట్లున్నాయని ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు - ఒరిజినల్ నోట్లని తేలడంతో వదిలిపెట్టిన వైనం తిరుపతి (అలిపిరి): తిరుమల పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీర్థయాత్రల్లో భాగంగా శ్రీవారి దర్శనం కోసం ఢిల్లీకి చెందిన ప్రదీప్(65), ఆయన భార్య మంగళవారం తిరుమలకు వచ్చారు. లేపాక్షి నుంచి ఎంబీసీ–14కి జీపులో వెళ్లారు. దిగేటప్పుడు వాహన డ్రైవర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. అది నకిలీ దంటూ ఆ డ్రైవర్ గొడవ చేశాడు. సమాచారం తెలుసుకున్న తిరుమల టూటౌన్ పోలీసులు ప్రదీప్, ఆయన భార్యను అదుపులోకి తీసుకొని, వారి వద్దనున్న రూ.12 వేల విలువైన రూ.100, రూ.50 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తీరా ఆ నోట్లను తిరుమలలోని ఓ బ్యాంకుకు పంపగా అవి ఒరిజినల్ నోట్లే అని తేలింది. దీంతో వారికి నగదు అప్పగించి పంపించేశారు. కాగా, ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ.. తాము మధుమేహ వ్యాధిగ్రస్తులమని, ఎక్కవ సమయం వేచి ఉండలేమని చెప్పినా పోలీసులు కనికరించలేదని వాపోయారు.