నకిలీ నోట్లున్నాయని.. | Tirumala police over action | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లున్నాయని..

Published Wed, Mar 1 2017 5:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

నకిలీ నోట్లున్నాయని..

నకిలీ నోట్లున్నాయని..

- తిరుమల పోలీసుల అత్యుత్సాహం
- నకిలీ నోట్లున్నాయని ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు  
- ఒరిజినల్‌ నోట్లని తేలడంతో వదిలిపెట్టిన వైనం


తిరుపతి (అలిపిరి): తిరుమల పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీర్థయాత్రల్లో భాగంగా శ్రీవారి దర్శనం కోసం ఢిల్లీకి చెందిన ప్రదీప్‌(65), ఆయన భార్య మంగళవారం తిరుమలకు వచ్చారు. లేపాక్షి నుంచి ఎంబీసీ–14కి జీపులో వెళ్లారు. దిగేటప్పుడు వాహన డ్రైవర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. అది నకిలీ దంటూ ఆ డ్రైవర్‌ గొడవ చేశాడు.

సమాచారం తెలుసుకున్న తిరుమల టూటౌన్‌ పోలీసులు ప్రదీప్, ఆయన భార్యను అదుపులోకి తీసుకొని, వారి వద్దనున్న రూ.12 వేల విలువైన రూ.100, రూ.50 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

తీరా ఆ నోట్లను తిరుమలలోని ఓ బ్యాంకుకు పంపగా అవి ఒరిజినల్‌ నోట్లే అని తేలింది. దీంతో వారికి నగదు అప్పగించి పంపించేశారు. కాగా, ప్రదీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాము మధుమేహ వ్యాధిగ్రస్తులమని, ఎక్కవ సమయం వేచి ఉండలేమని చెప్పినా పోలీసులు కనికరించలేదని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement