Older couples
-
లేటు వయసులో విడిపోతున్న జంటలు
భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్‌పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం. గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తికొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు. 2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది. 3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలుప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది. 4. ఆర్థిక స్వాతంత్య్రంగతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు. 5. విడాకులపై సామాజిక స్వీకారంఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రే డివోర్స్‌తో సమస్యలు.. గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు. ·గ్రే డివోర్స్ను తప్పించేందుకు సూచనలు1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి. 3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి. 4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి. 5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి. 6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి. 7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి. 8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది. -
కూతురి హింస ... వృద్ధుల ఆత్మహత్యాయత్నం
- భర్త మృతి.. చావుబతుకుల్లో భార్య - పురుగుల మందు తాగి.. కిటికీకి ఉరి వేసుకున్న భర్త హసన్‌పర్తి(వర్దన్నపేట): డబ్బుల కోసం కూతురు పెడుతున్న వేధింపులు భరించలేక సోమవారం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన రత్నం సత్యనారాయణరెడ్డి (70), తిరుపతమ్మ(65) దంపతులు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం పలివేల్పులలో స్థిరపడ్డారు. సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. కొంతకాలంగా తండ్రిని కూతురు శ్రీదేవి, అల్లుడు శివకుమార్‌లు డబ్బుల విషయంలో వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి దంపతులు సోమవారం పురుగుల మందు తాగారు.తొలుత తిరుపతమ్మ వాంతులు చేసుకుంది. తనకూ అలాగై బతికేస్తానేమోనని భావించిన సత్యనారాయణ రెడ్డి కిటికీకి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందు అతను సమీప బంధువు రమేశ్‌రెడ్డికి ఫోన్ చేసి ఉదయం 11.30 గంటలకు ఇంటికి రమ్మని, హైదరాబాద్ నుంచి తన కుమారుడు శ్రీధర్ కూడా వస్తున్నట్లు చెప్పాడు. మాటల్లో ఏదో తేడా కనిపించడంతో రమేశ్‌రెడ్డి దంపతులు హుటాహుటిన ఆనంద్‌నగర్‌కాలనీకి చేరుకున్నారు. దంపతులు బయట నుంచి తాళం వేసి.. తాళం చెవిని బాత్రూం వద్ద పెట్టారు. ఈ విషయాన్ని రమేశ్‌రెడ్డికి ముందుగానే ఫోన్లో చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చేసరికి తిరుపతమ్మ చావుబతుకుల మధ్య కనిపించింది. ఆమెను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దంపతులు కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, నగర పోలీస్ కమిషనర్, పోలీస్ ఇన్స్పెక్టర్లతో పాటు మరో నలుగురికి లేఖ రాసి పెట్టారు. తమ మరణానికి తమ కూతురు శ్రీదేవి, అల్లుడు శివకుమార్, కుమార్తె స్నేహితురాలు ఆర్.శ్రీదేవి, ఉపాధ్యాయురాలు వినీత కారణమని పేర్కొన్నారు. వీరితో పాటు పంచాయితీ పెద్దలుగా వ్యవహరించిన సదానందం, సమ్మయ్య కూడా కారకులని మృతుడి కుమారుడు శ్రీధర్ తెలిపాడు. ఈ మేరకు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. -
నకిలీ నోట్లున్నాయని..
- తిరుమల పోలీసుల అత్యుత్సాహం - నకిలీ నోట్లున్నాయని ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు - ఒరిజినల్ నోట్లని తేలడంతో వదిలిపెట్టిన వైనం తిరుపతి (అలిపిరి): తిరుమల పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీర్థయాత్రల్లో భాగంగా శ్రీవారి దర్శనం కోసం ఢిల్లీకి చెందిన ప్రదీప్(65), ఆయన భార్య మంగళవారం తిరుమలకు వచ్చారు. లేపాక్షి నుంచి ఎంబీసీ–14కి జీపులో వెళ్లారు. దిగేటప్పుడు వాహన డ్రైవర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. అది నకిలీ దంటూ ఆ డ్రైవర్ గొడవ చేశాడు. సమాచారం తెలుసుకున్న తిరుమల టూటౌన్ పోలీసులు ప్రదీప్, ఆయన భార్యను అదుపులోకి తీసుకొని, వారి వద్దనున్న రూ.12 వేల విలువైన రూ.100, రూ.50 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తీరా ఆ నోట్లను తిరుమలలోని ఓ బ్యాంకుకు పంపగా అవి ఒరిజినల్ నోట్లే అని తేలింది. దీంతో వారికి నగదు అప్పగించి పంపించేశారు. కాగా, ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ.. తాము మధుమేహ వ్యాధిగ్రస్తులమని, ఎక్కవ సమయం వేచి ఉండలేమని చెప్పినా పోలీసులు కనికరించలేదని వాపోయారు. -
పెళ్లింట విషాదం
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం... భర్త మృతి ఎల్లారెడ్డిపేట: మనుమరాలి పెళ్లి విషయంలో వృద్ధ దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవతో ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేయగా, ఈ ఘటనలో భర్త మృతి చెందాడు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లికి చెందిన నాగం ఆశవ్వ-నర్సయ్యలది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నాగం కొమురయ్య అతని భార్య రేణ అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఒక కూతురు అంజలి, కుమారుడు అనిల్ ఉన్నారు. అంజలి వివాహం గత బుధవారం జరిగింది. ఆశవ్వ, ఆమె చిన్న కొడుకు మొండయ్య కలసి రూ.రెండున్నర లక్షలు అప్పు చేసి అంజలి పెళ్లి చేశారు. అంత అప్పు చేసి మనుమరాలి పెళ్లి ఘనంగా చేయాల్సిన అవసరం ఏముందని భార్యను నర్సయ్య(75) మందలించాడు. ఇద్దరి మధ్య పెళ్లి విషయంతో పాటు అప్పుల విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆశవ్వ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి తరలించారు. ఇంటి వద్దే ఉన్న నర్సయ్య ఆందోళనతో సోమవారం వేకువ జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశవ్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
మలిసంధ్యలో ఎడబాటు
-
మలిసంధ్యలో ఎడబాటు
లండన్‌లో వేర్వేరు కేర్ హోమ్స్‌లో చికిత్స పొందుతున్న కెనడా వృద్ధ దంపతులు కలుసుకొని తీవ్ర భావోద్వేగాలకు లోనైనపుడు వారి మనవరాలు తీసిన ఫొటో ఇది. భర్త వోల్‌ఫ్రమ్ గోట్స్చాక్(83) మతిమరుపు వ్యాధితో, భార్య అనిత(81) కేన్సర్‌తో బాధపడుతున్నారు. 62 ఏళ్లు కలిసి జీవించి చరమాంక ంలో ఇలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆక ర్షించింది. వాళ్లను ఒకే చోట ఉంచి వైద్యం అందించే మార్గాలకు అన్వేషణ మొదలైంది. -
ఆస్తి లాక్కొని.. ఆకలితో మాడ్చారు
* కన్నీటిపర్యంతమైన వృద్ధ దంపతులు * న్యాయం కోసం పోలీసులకు వేడుకోలు * ఎస్ఐ చొరవతో ఎట్టకేలకు దిగొచ్చిన బిడ్డలు పెద్దవడుగూరు: రక్తమాంసాలు పంచుకుపుట్టిన బిడ్డలకు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు భారమయ్యారు. మలిసంధ్యలో కొండంత అండగా ఉండాల్సిన పిల్లలు వారి పాలిట కర్కోటకులుగా మారారు. ఆస్తినంతా లాక్కొని అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చారు. ఎంతైనా పిల్లలే కదా అని ఇన్నాళ్లూ మౌనంగా రోజులు గడిపిన ఆ పండుటాకులు చివరకు కాలేకడుపులతో పోలీసులను ఆశ్రయించారు. పెద్దవడుగూరు మండలం మేడిమాకుపల్లికి చెందిన రామాంజినమ్మకు భర్త లేడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారందరికీ అన్నీ తానై పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన ఆమె ఇప్పుడు బరువైంది. ఉన్న నాలుగెకరాల పొలాన్ని లాక్కొన్న కుమారులు పిడికెడు అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చారు. ప్రభుత్వం కూడా పింఛన్ ఇవ్వకుండా ఏడిపిస్తోంది. దిమ్మగుడికి చెందిన జయలక్ష్మి, ఆంజినేయులు దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఉన్న ఐదెకరాల పొలాన్ని కొడుకులే అనుభవించుకుంటున్నారు. అయితే ఒక్కపూట కూడా ఆ వృద్ధ దంపతులకు అన్నం పెట్టిన పాపాన పోలేదు. అన్నం లేక పేగులు మెలిపెడుతుంటే తట్టుకోలేక పెద్దవడుగూరు ఎస్ఐ ర మణారెడ్డిని మంగళవారం కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో చలించిన ఆయన వెంటనే ఆయా గ్రామాలకు పోలీసులను పంపి, వెంటనే ఆ వృద్ధుల పిల్లలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మానాన్నను నిర్లక్ష్యం చేస్తే కేసు పెట్టి జైలుకు పంపుతానని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ఆ బిడ్డలు.. పొరపాటైపోయిందని, ఇక మీదట ఇటువంటి తప్పు చేయమని, సక్రమంగా చూసుకుంటామంటూ హామీ ఇచ్చి తమ వెంట వారిని పిల్చుకెళ్లారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన నాగరత్నమ్మ
* 17 రోజులపాటు కోమాలో * దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతులు * భార్య మృతి,భర్త పరిస్థితి విషమం తెనాలి రూరల్: దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతుల్లో భార్య మృతి చెందింది. ఇంట్లో ఉన్న సొత్తును అపహరించుకెళ్లేందుకు వచ్చిన దుండగులు ఒంటరిగా ఉన్న దంపతులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చారు. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన భార్యను మృత్యువు కబళించింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ (85) తమ స్వగృహంలో నివసిస్తుండేవారు.మే నెల 29వ తేదీన వీరిపై గుర్తు తెలియని దుండగులు విచక్షనా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు 30వ తేదీ మధ్యాహ్నం వీరికి బట్టలు ఉతికేందుకు వచ్చే బాజి ఇంటికి వచ్చి చూడగా, గ్రిల్స్ లోపలి వైపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడికి సమీపంలో నివసించే దంపతుల కుమారుడి కుటుంసభ్యులకు తెలియజేసింది. వారు వచ్చి పిలిచినా ఫలితం లేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకకు వెళ్లి చూడగా, తలుపు తీసి ఉంది. లోపల వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న దంపతులు ఇద్దర్నీ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు సమగ్ర వైద్యశాలకు వైద్యులు పంపారు. ఘటన జరిగిన నాటి నుంచి దంపతులిరువురూ కోమాలో ఉన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు మార్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగరత్నమ్మ మృతి చెందింది. మృతదేహానికి గుంటూరు సమగ్ర వైద్యశాలలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, సాయత్రం నాలుగు గంటల ప్రాంతంలో స్వగ్రామం నందివెలుగుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దుండుగల దాడిలో గాయపడిన వెంకటనారాయణ శాస్త్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కళ్లు తెరచి చూడటం మినహా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు సవాలుగా మారిన కేసు.. 17 రోజులు గడిచినా కేసులో పురోగతి లేదు. దంపతుల్లో ఎవరైనా పూర్తి స్పృహలోకి వచ్చి సమాచారం చెబితే గానీ కేసు ముందుకు కదలని పరిస్థితి. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావును దర్యాప్తు చేసేందుకు నియమించారు. మరో వైపు తెనాలి డీఎస్పీ జీవీ రమణమూర్తి, తాలూకా సీఐ యు. రవిచంద్ర కేసు గురించి ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. గ్రామంలో బేలుదారి పనికి వచ్చిన వారే చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధ దంపతుల దారుణహత్య
♦ నెల్లూరు సమీపంలోని పెద్దచెరుకూరులో కిరాతకం ♦ శివాలయం ఆవరణలో ఘటన ♦ మృతులది పర్చూరు మండలం నూతలపాడు ♦ అంతర్రాష్ట్ర ముఠాలపై అనుమానం నెల్లూరు (బారకాసు) : నిద్రలోనే వారి జీవితం తెల్లారిపోయింది. రోజూ ఉదయాన్నే లేచి శివయ్య సేవలో తరించే ఆ దంపతులకు శనివారం ఆ భాగ్యం లేకుండా పోయింది. ఎక్కడి నుంచి వచ్చారో.. ఎందుకు వచ్చారో తెలియదుగానీ గుర్తుతెలియని దుండగులు వారిని కిరాతకంగా హతమార్చారు. బీహార్, కిరాయి హంతకుల తరహాలో తలపగలగొట్టి నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు (66), పుష్పవేణి (60) దంపతుల ఉసురు తీశారు. జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటన నెల్లూరు సమీపంలోని పెద్దచెరుకూరులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణి దంపతులు కుమారుడు సుబ్బయ్యశాస్త్రితో కలిసి 11 ఏళ్ల క్రితం పెద్దచెరుకూరు వచ్చారు. అప్పటి నుంచి గ్రామంలోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. సుబ్బయ్యశాస్త్రి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేస్తుంటారు. తల్లిదండ్రులు ఆలయ ఆవరణలోని రేకుల ఇంట్లో ఉండగా, సుబ్బయ్యశాస్త్రి మరో ఇంట్లో భార్యపిల్లలతో కలిసి ఉంటున్నాడు. మొదట్లో చంద్రమౌళీశ్వరరావు కూడా అర్చకుడిగా ఉండేవారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచానికే పరిమితమయ్యారు. కిరాతక ఘటన... వృద్ధ దంపతులను దుండగులు గుర్తుతెలియని ఆయుధాలతో తలలపై మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళీశ్వరరావు నేలపై పడివుండగా, పుష్పవేణి మంచంపైనే కన్నుమూశారు. ఆలయ తాళాలు, దుస్తులు, పంచాంగం పుస్తకాలు ఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడివున్నాయి. పుష్పవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శేఖరబాబు ఘటన స్థలానికి చేరుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం ఘటన స్థలంలో ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యాయి. జాగిలం శివాలయం ఆవరణలో నుంచి వంతెన మీదుగా కోడూరు రోడ్డు వరకు వెళ్లి వెనుదిరిగింది. అనంతరం ఎస్పీ విశాల్‌గున్నీ ఘటన స్థలాన్ని పరిశీలించి వివిధ కోణాల్లో ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు... కేసు దర్యాప్తునకు ఎస్పీ విశాల్‌గున్నీ మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రధానంగా ఇది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠాల పనిగా అనుమానిస్తున్నారు. ఇటీవల కావలి శివారులో జరిగిన ఘటనతో దీనిని పోల్చుకుంటూ విచారిస్తున్నారు. మరోవైపు స్థానిక పరిస్థితులపై ద ృష్టిపెట్టారు. చంద్రమౌళీశ్వరరావు ఇటీవల ఒకరికి అప్పుగా ఇచ్చిన కొంత మొత్తం తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వారు ఎవరైనా దారుణానికి ఒడిగట్టారా.. అని స్థానికులు అనునిస్తున్నారు. ప్రజాప్రతినిధుల పరామర్శ... సుబ్బయ్యశాస్త్రి తల్లిదండ్రులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, మేకల రామ్మూర్తి ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు గల కారణాలు తెలుసుకుని దుండగులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. నిద్రలోనే అనంతలోకాలకు... పుష్పవేణి ఉదయాన్నే ఆలయ తలుపులు తెరిచి దీపారాధన చేస్తుంటారు. శనివారం మాత్రం ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదు. పాలుపోసే వ్యక్తి వచ్చి తలుపు తీయగా చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణి దంపతులు విగతజీవులుగా పడివున్నారు. అతను వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. కుమారుడు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. -
ఇది మా వాహనం...
చైనాలోని ఝెజియాంగ్ ఫ్రావిన్స్‌లోని యివూ పట్టణంలో ఓ వృద్ధ దంపతులు ఇలా కుక్కలు లాగే బండిని తమ రవాణా అవసరాలకు ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రిటైరయ్యాక మోకాళ్ల నొప్పి కారణంగా ఎక్కువ దూరం నడవలేకపోతున్నపుడు ఈ ఐడియా వచ్చిందని చెబుతున్నాడీ పెద్దమనిషి. ఆయన దగ్గర ఓ ఎలక్ట్రికల్ స్కూటరుండేది. అతి బాగా పాతదైపోయి పనికిరాకుండా పోయింది. దాని ఇంజిన్‌ను తొలగించి... ఇలా తన పెంపుడు కుక్కలను కట్టేసి లాగించేస్తున్నాడు. అదేమిటి కొత్తది కొనుక్కోవచ్చు కదా... అంటే తనకు ఇప్పుడంత ఆర్థిక స్తోమత లేదని బదులిస్తున్నాడు. ఈ బండిలో దంపతులిద్దరూ షికారుకెళితే రోడ్డుపై అందరి చూపు వీరిపైనే. కొందరు జంతు ప్రేమికులేమో శునకాలను హింసించడం అన్యాయమంటూ మొత్తుకుంటున్నారు. ఇంకొందరేమో ఇది చట్టబద్ధమేనా అని నెట్లో నిలదీస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైతే పోలీసులు వీరి విషయంలో కలుగజేసుకోలేదు.