పెళ్లింట విషాదం | tragedy in mariage event | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Published Tue, Nov 15 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

పెళ్లింట విషాదం

పెళ్లింట విషాదం

వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం... భర్త మృతి
ఎల్లారెడ్డిపేట: మనుమరాలి పెళ్లి విషయంలో వృద్ధ దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవతో ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేయగా, ఈ ఘటనలో భర్త మృతి చెందాడు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది. రాజన్న  సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లికి చెందిన నాగం ఆశవ్వ-నర్సయ్యలది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నాగం కొమురయ్య అతని భార్య రేణ అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఒక కూతురు అంజలి, కుమారుడు అనిల్ ఉన్నారు.

అంజలి వివాహం గత బుధవారం జరిగింది. ఆశవ్వ, ఆమె చిన్న కొడుకు మొండయ్య కలసి రూ.రెండున్నర లక్షలు అప్పు చేసి అంజలి పెళ్లి చేశారు. అంత అప్పు చేసి మనుమరాలి పెళ్లి ఘనంగా చేయాల్సిన అవసరం ఏముందని భార్యను నర్సయ్య(75) మందలించాడు. ఇద్దరి మధ్య పెళ్లి విషయంతో పాటు అప్పుల విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆశవ్వ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి తరలించారు. ఇంటి వద్దే ఉన్న నర్సయ్య ఆందోళనతో సోమవారం వేకువ జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశవ్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement