Narsayya
-
ఠాణాలో యువకుడి మృతి
బెల్లంపల్లి: పోలీస్‌స్టేషన్‌లోనే ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన కీర్తి లక్ష్మీనర్సయ్య ఇంటిపై అతడి అన్నకొడుకు కీర్తి అంజి(24) మద్యంమత్తులో ఆదివారం ఉదయం దాడి చేశాడు. విచక్షణ కోల్పోయి తిడుతూ..చితకబాదడంతో లక్ష్మీనర్సయ్య తలకు గాయాలయ్యాయి. పైగా చంపేస్తానని అంజి హెచ్చరించాడు. భయపడిన లక్ష్మీనర్సయ్య 100కు డయల్ చేశాడు. బెల్లంపల్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఘటనాస్థలికి వెళ్లి అంజిని ఠాణాకు తీసుకెళ్లి విచారణ చేశారు. సాయంత్రం అంజిని ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులు అతడి సోదరుడికి ఫోన్ చేయగా, తాను మంచిర్యాలలో ఉన్నానని, బెల్లంపల్లికి రాగానే ఠాణాకు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో.. రాత్రి 8.30గంటల ప్రాంతంలో అంజికి ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది. సీసీ ఫుటేజీ పరిశీలిస్తే అంజి పోలీస్‌స్టేషన్‌లోని వరండాలోని కురీ్చలో కూర్చుని పక్కకు ఒరిగిన దృశ్యం కనిపించింది. ఇది గమనించిన కానిస్టేబుల్ పక్క గదిలోకి వెళ్లి నీళ్లు తీసుకురాగా, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి నీరు తాగించడానికి ప్రయత్నించగా, స్పందించని దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పరీక్షించి అంజి మృతిచెందినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులే కొట్టి చంపారని మృతుడి సోదరులు, కుటుంబస భ్యులు ఆరోపించారు. దీంతో డీసీపీ సుధీర్‌రాంనాథ్ కేకన్, ఏసీ పీ పంతాటి సదయ్యలు సంఘటనపై సమీక్షించారు. పోలీసుల సమాచారం మేరకు మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి అజయ్‌కల్లం సోమవారం మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అంజి మరణానికి పోలీసులే కారణమని అతడి కుటుంబీకులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఒంటిపై గాయాలున్నాయని, పోలీసు దెబ్బలకు తాళలేక చనిపోయాడని అంజి బావ బుర్ర లక్ష్మణ్ సెల్ఫోన్లో సీసీ ఫుటేజీ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేశాడు. తన బావమరి దిని పోలీసులే చంపారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మృతుడి శరీరంపై గాయాలను పరిశీలించి న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకున్నారు. అంజి చనిపోయిన తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చారని, అతడి సోదరులు కీర్తి వీరేశం, లక్ష్మణ్, పెద్దనాన్న కొడుకు కీర్తి వీరేందర్, చిన్నమ్మ అంజమ్మ పోలీసులపై మండిపడ్డారు. అంజికి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబీకులు స్పష్టం చేశారు. కాగా, న్యాయమూర్తి సూచనల మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా, అంత్యక్రియలు నిర్వహించారు. -
పెళ్లింట విషాదం
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం... భర్త మృతి ఎల్లారెడ్డిపేట: మనుమరాలి పెళ్లి విషయంలో వృద్ధ దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవతో ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేయగా, ఈ ఘటనలో భర్త మృతి చెందాడు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లికి చెందిన నాగం ఆశవ్వ-నర్సయ్యలది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నాగం కొమురయ్య అతని భార్య రేణ అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఒక కూతురు అంజలి, కుమారుడు అనిల్ ఉన్నారు. అంజలి వివాహం గత బుధవారం జరిగింది. ఆశవ్వ, ఆమె చిన్న కొడుకు మొండయ్య కలసి రూ.రెండున్నర లక్షలు అప్పు చేసి అంజలి పెళ్లి చేశారు. అంత అప్పు చేసి మనుమరాలి పెళ్లి ఘనంగా చేయాల్సిన అవసరం ఏముందని భార్యను నర్సయ్య(75) మందలించాడు. ఇద్దరి మధ్య పెళ్లి విషయంతో పాటు అప్పుల విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆశవ్వ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి తరలించారు. ఇంటి వద్దే ఉన్న నర్సయ్య ఆందోళనతో సోమవారం వేకువ జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశవ్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
‘కంతనపల్లి’ని కట్టొద్దు..
చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయూలి ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య ములుగు : 23 ఆదివాసీ గ్రామాలను జలసమాధి చేసే కంతనపల్లి ప్రాజెక్టును కట్టొద్దని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య డిమాండ్ చేశారు. ప్రాజెక్టును కట్టడం ద్వారా ఆదివాసీలకు వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని... ఈ ప్రాజెక్టుతో వారి జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పీసా చట్టం-2011 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించదలుచుకుంటే ప్రభుత్వం ముందుగా ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. అవేమి చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగడం ఆదివాసీ చట్టాలను అవమాన పరచడమేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముంపు గ్రామాల ప్రజలతో సత్వరమే చర్చలు జరపాలన్నారు. బంగారు తెలంగాణ అంటే ఆదివాసీలను జలసమాధి చేయడమేనా అని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన ఏటూరునాగారం ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా సమ్మక్క-సారలమ్మ తల్లుల పేరుమీద అటానమస్ జిల్లా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీ జాబితాలో కైత లంబాడ, వాల్మీకి బోయలను కలపడానికి ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు పొడెం బాబు, పులిశె బాలక్రిష్ణ, ఆగబోయిన రవి, పడిగ నాగేశ్వర్రావు, చంద మహేష్, కొర్నిబెల్లి గణేష్, నల్లెబోయిన లక్ష్మణ్‌రావు, అర్రెం అచ్చుపటేల్, చంద రఘుపతిరావు, కాక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ రాదేమోనని వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు(ఎం): పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) గ్రామ పరిధి కామునిగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాద నర్సయ్య (70) వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఆసరా పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు కూడా చేసుకున్నాడు. శనివారం లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద అతికిస్తామని ఆధికారులు పేర్కొనడంతో నర్సయ్య అక్కడికి వెళ్లాడు. అక్కడున్న అధికారులను అడిగాడు. జాబితా ఇంకా రాలేదని వారు చెప్పడంతో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. ఏ అధికారీ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి విద్యుత్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
బావిలో పడి కౌలు రైతు మృతి
నర్సింహులపేట: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు బావిలో పడి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. నర్సింహులపేటకు చెందిన పెదమాముల నర్సయ్య(55) భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రాత్రి కరెంట్ కావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు బావి మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి బావిలోపడి మృతిచెందాడు.