ఇది మా వాహనం... | Older couples using dogs pulling cart for transportation requirements | Sakshi
Sakshi News home page

ఇది మా వాహనం...

Published Sun, Mar 6 2016 2:52 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

ఇది మా వాహనం... - Sakshi

ఇది మా వాహనం...

చైనాలోని ఝెజియాంగ్ ఫ్రావిన్స్‌లోని యివూ పట్టణంలో ఓ వృద్ధ దంపతులు ఇలా కుక్కలు లాగే బండిని తమ రవాణా అవసరాలకు ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రిటైరయ్యాక మోకాళ్ల నొప్పి కారణంగా ఎక్కువ దూరం నడవలేకపోతున్నపుడు ఈ ఐడియా వచ్చిందని చెబుతున్నాడీ పెద్దమనిషి. ఆయన దగ్గర ఓ ఎలక్ట్రికల్ స్కూటరుండేది. అతి బాగా పాతదైపోయి పనికిరాకుండా పోయింది. దాని ఇంజిన్‌ను తొలగించి... ఇలా తన పెంపుడు కుక్కలను కట్టేసి లాగించేస్తున్నాడు. అదేమిటి కొత్తది కొనుక్కోవచ్చు కదా... అంటే తనకు ఇప్పుడంత ఆర్థిక స్తోమత లేదని బదులిస్తున్నాడు. ఈ బండిలో దంపతులిద్దరూ షికారుకెళితే రోడ్డుపై అందరి చూపు వీరిపైనే. కొందరు జంతు ప్రేమికులేమో శునకాలను హింసించడం అన్యాయమంటూ మొత్తుకుంటున్నారు. ఇంకొందరేమో ఇది చట్టబద్ధమేనా అని నెట్‌లో నిలదీస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైతే పోలీసులు వీరి విషయంలో కలుగజేసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement