హోటల్లో అగ్నిప్రమాదం
సూళ్లూరుపేట : పట్టణంలోని బైపాస్‌రోడ్డులో ఓ హోటల్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.4 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. మురళి అనే యువకుడు బైపాస్‌రోడ్డు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హోటల్, బంకు, కూల్‌డ్రింగ్ షాపు నడుపుకుంటున్నారు. ఆదివారం వ్యాపారం ఎక్కువగా ఉంటుందని 11 గంటల సమయంలో వంటలు చేస్తుండగా విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. హోటల్‌కు వెనుక భాగంలో మంటలు భారీగా విస్తరించడంతో స్థానికులు కేకలు వేశారు. అప్పటికే మంటలు వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు అంతా కాలిపోయి బూడిద మిగిలింది. హోటల్‌కు సంబంధించిన అన్ని వస్తువులతో పాటు ఫ్రిజ్, ఇన్వర్టర్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లు ఆగ్నికి ఆహుతైపోయాయి. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ జీ గంగాధర్‌రావు పరిశీలించారు. తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని బాధితులు తెలిపారు.