సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రంజిత్ సింగ్, సుమిత్ సింగ్‌తోపాటు మేనేజర్, సూపర్‌వైజర్ ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు మేడ్చల్ ఫాంహౌస్‌లో తలదాచుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు.
అంతటా నిర్లక్ష్యమే..
భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు ఘోర ప్రమాదానికి కారణలయ్యాయి. మంటలు చెలరేగినప్పుడు.. ఫోమ్ సిలిండర్లు ఉపయోగించి సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేసినా అవి పని చేయలేదు. ఇలాంటి బ్యాటరీ ప్రమాదాలు సంభవించినప్పుడు నీటి బదులు.. వాడాల్సిన ఏబీసీ పౌడర్ అందుబాటులో లేదు.
ద్వారాలు లేవు.. సెల్లార్‌ను పార్కింగ్‌కోసం కాఉండా కమర్‌సియల్ కార్యకలాపాలకు వాడారు. అసలు లాడ్జి ఎన్‌వోసీ కూడా సరిగా లేకపోవడం, అధికారులు స్పందన పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక, ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఇక, అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment