
సాక్షి, నెల్లూరు : సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణలు కోల్పోయాడు. నాగుపాముతో సెల్ఫీ తీసుకునేందుకు జగదీష్ అనే యువకుడు ప్రయత్నం చేయగా.. పాము కాటేసింది. ఈ ఘటన మంగళవారం సుళ్లురుపేట మండలం మంగళపాడులో చోటుచేసుకుంది. ఇది గమనించిన సమీప వ్యక్తులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలిచండంతో చికిత్స పొందుతు మృతి చెందాడు. పాములో విష తీవ్రత ఎక్కువగా ఉండడంతో శరీరమంతా పాకి పరిస్థితి విషమించడంతో యువకుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.