సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నవంబర్ 7న సాయంత్రం 3.02 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను రూపొందించి ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా నవంబర్ 7న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
చదవండి: అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment