సాక్షి, ముంబై: కిడ్నాపర్ల చెరనుంచి 83 మంది చిన్నారులకు విముక్తి లభించింది. కుర్లా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), ప్రధమ్ అనే సామాజిక సేవా సంస్థ లోక్‌మాన్య తిలక్ టెర్మినస్‌లో సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని జీఆర్పీ సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ దోపార్కర్ వెల్లడించారు. పిల్లల బలవంతపు తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తమకు అందించారన్నారు.
కిడ్నాపర్లు జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దాదాపు 83 మంది చిన్న పిల్లలను తరలిస్తున్నారని తెలిపారు. ఉదయం ఐదు గంటలకు రావాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలు గంట ఆల స్యంగా వచ్చింది. చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు 83మంది పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చారన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అరెస్టులు జరగలేదన్నారు.
కిడ్నాపర్ల చెరనుంచి చిన్నారులకు విముక్తి
Published Tue, Dec 16 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement