శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి | Engineering student fall dead | Sakshi
Sakshi News home page

శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి

Published Tue, Nov 1 2016 4:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి

శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి

కిడ్నాప్ అరుునట్టు భావించిన యువకుడి మృతి
హత్యేనంటున్న బంధువులు
పోలీసుల అదుపులో ప్రదీప్‌పై దాడిచేసిన నిందితులు


కశింకోట: కశింకోటలో  కిడ్నాప్ అరుునట్టు భావిస్తున్న  ఇంజినీరింగ్  విద్యార్థి సోమవారం శవమై కనిపించడం  సంచలనం కలకలంరేపింది.. ఇది హత్యా? లేక ఆత్మహత్య? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. మాకవరపాలెంలోని ఒక కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న అగనంపూడి దానబోరుునపాలెంకి చెందిన దానా ప్రదీప్(22) కనిపించకపోవడంతో గత శనివారం అతని తండ్రి రాము పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే.  ప్రదీప్ గత శుక్రవారం తన స్నేహితుడు తులసీకుమార్‌తో కలిసి కశింకోట వచ్చాడు. తనతో పాటు బీటెక్ 4వ సంత్సరం చదువుతున్న కశింకోటకు చెందిన సహా విద్యార్థినితో పరిచయం ఉన్న మేరకు మాట్లాడ సాగారు. ఈ విషయాన్ని గమనించిన ఆ విద్యార్థిని బంధువులు సారుు, సాకేత్ తదితరులు ప్రదీప్‌ను కొట్టి గాయపరిచారు.  ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని అతనితోపాటు వచ్చిన స్నేహితుడు తులసీకుమార్‌ను బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.   అరుుతే ప్రదీప్  అప్పటి నుంచి ఇంటికి చేరకపోవడంతో తండ్రి రాము అనుమానంతో  పోలీసులను ఆశ్రరుుంచి,  కిడ్నాప్ చేసినట్టు    ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి  గాలింపు  చేపట్టగా,  మునగపాక మండల పరిధిలోని ఉమ్మలాడ వద్ద శారదానదిలో  శవమై ప్రదీప్ కనిపించాడు.  సరిగ్గా గుర్తు పట్టని విధంగా ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు  వెలికి తీసి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి   తరలించారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అరుుతే కిడ్నాప్‌కు గురైన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడా?లేక హత్య చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మృతదేహం చేతులు కట్టి ఉండటాన్ని బట్టి  హత్య చేసి ఉంటారని   తండ్రి రాము,  బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు 25 మంది ప్రమేయం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  అరుుతే నది నుంచి మృతదేహాన్ని వెలికి తీయడానికి   చేతులకు    చీర కట్టినట్టు ఎస్‌ఐ బి.మధుసూదనరావు పేర్కొన్నారు.     సంఘటన జరిగిన రోజు  ప్రదీప్‌ను  కొట్టిన నిందితులు సారుు,సాకేత్ తమ అదుపులో ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  శోక సంద్రంలో కుటుంబం : రాము,సత్యవతి దంపతులకు మృతుడు ప్రదీప్ ఒక్కడే కుమారుడు. కుమార్తెకు వివాహం అరుుంది.  దర్జీగా పని చేస్తూ రాము తన కుమారుడు పదీప్‌ను చదివిస్తున్నాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడం కుటుంబాన్ని కలచి వేచింది.   శోక సముద్రంలో మునిగిపోయారు. శనివారం ఫిర్యాదు చేయగా, ఆదివారానికి కూడా పోలీసులు ప్రదీప్ ఆచూకీ తెలపకపోవడంపై కుటుంబ సభ్యులు  కశింకోట పోలీసు స్టేషన్ వద్ద  ఆందోళన చేశారు

న్యాయం చేయాలి : ప్రదీప్ వ్యవహారంలో అతని కుటుంబానికి పోలీసులు  న్యాయం చేయాలని వైఎస్సార్  సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జిలకర్ర నాగేంద్ర డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని   విశాఖ జీవీఎంసీ   56వ వార్డు   వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు    పూర్ణానంద శర్మ  విమర్శించారు.

బాధితుల ఆందోళన
అనకాపల్లిటౌన్: కశింకోట పోలీసులకు వ్యతిరేకంగా గాజువాక మండలం అగనంపూడి దానబోరుునపాలెం గ్రామస్తులు, ప్రదీప్ కుటుంబ సభ్యులు  సోమవారం రాత్రి   ఆందోళనకు దిగారు.  తమ కుమారుడు ప్రదీప్ (22)ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినా కశింకోట పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ప్రదీప్ సజీవంగా ఉండేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద  ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని డీఎస్పీ పురుషోత్తంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఎస్పీ పోస్టుమార్టం పరీక్షల అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పల్లాకు చెప్పడంతో ఆందోళనకారులను ఎమ్మెల్యే పల్లా శాంతింపచేశారు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement