Kidnapped child in greed of 15 lakhs మధ్యప్రదేశ్: శివపురిలోని భావఖేడి గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.15 లక్షల కోసం చిన్నారిని ఇద్దరు కిడ్నాప్ చేశారని, మూడో నేరస్థుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వార్తను నేరగాళ్లకు చేరవేస్తున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ..
ఫిర్యాదుదారుడు రామ్‌జీలాల్ యాదవ్ తన మేనల్లుడు నరేంద్ర యాదవ్ కుమారుడు హరిఓమ్ (6) డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయాడని భావ్‌ఖేడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెతికినా జాడకనిపించలేదని, సాయంత్రం 4 గంటల 26 నిముషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. చిన్నారి తమ వద్దనే ఉన్నాడని, రూ. 15 లక్షలు సిద్ధం చేసుకోమని, ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే బిడ్డ దక్కడని చెప్పి కిడ్నాపర్లు కాల్ డిస్‌కనెక్ట్ చేసినట్లు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసు బృందం రంగంలోకి దిగింది. భయాందోళనలకు గురైన నేరస్థులు చిన్నారిని గ్రామంలో రహదారిపై విడిచిపెట్టారు.
అనంతరం పోలీసులు చిన్నారిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 15 లక్షల రూపాయల డబ్బు కోసం రెండు నెలల క్రితమే ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్నారి కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. కాగా పోలీసులు ముగ్గురు నేరగాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మీడియాకు తెలిపారు.
చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Comments
Please login to add a commentAdd a comment