spelling
-
తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు
లక్నో: ఓ ఫేక్ కిడ్నాప్ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఒక ఇంగ్లీష్ పదానికి రాంగ్ స్పెల్లింగ్ రాసిన క్లూతో కేసు అసలు గుట్టును రట్టు చేశారు. ఈ నకిలీ కిడ్నాప్ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన సందీప్ (27) తాను కిడ్నాప్ అయినట్లు నాటకమాడి,రూ.50వేలు ఇవ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేస్తూ వేరే ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు.సోదరుడికి పంపిన బెదిరింపు మెసేజ్‌లో డబ్బులు ఇవ్వకుంటే సందీప్‌ను చంపేస్తామని రాసిన చోట డెత్ అనే పదాన్ని తప్పుగా(deathబదులుdeth)అని రాశాడు. ఈ మెసేజ్ నిశితంగా పరిశీలించిన పోలీసులు దానిని పంపిన వ్యక్తి అంతగా చదువుకోని వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. పైగా సందీప్‌కు శత్రువులు ఎవరూ లేకపోవడంతో అనుమానం బలపడింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా సందీప్ ఆచూకీ గుర్తించారు.కిడ్నాప్ విషయమై సందీప్‌ను విచారించారు. విచారణ సందర్భంగా ఆ బెదిరింపు మెసేజ్‌ను రాయమని సందీప్‌ను కోరారు. దీంతో సందీప్ మరోసారి ‘డెత్’ అనే పదాన్ని తప్పుగా రాయడంతో కిడ్నాప్ నాటకమాడింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బుల కోసం తానే ఈ నాటకం ఆడానని, ఓ పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు. ఇదీ చదవండి: పెళ్లికి సాయం చేస్తానని పిలిచి -
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్‌తో సత్తా చాటాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!) -
'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన
ప్రభుత్వాధికారులతో పనిపడినా లేక ఏదైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్న ఒక పట్టాన పని అవ్వదు. మన పనులన్ని పక్కన పెట్టుకుని వారి చుట్టు కాళ్లు అరిగేలా తిరిగితే గానీ పనవ్వదు అందరికి తెలిసిందే. అందువల్లే ప్రజలు ప్రభుత్వాధికారులంటేనే చాలా భయపడతారు. అచ్చం అలానే ఒక వ్యక్తి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా పని అవ్వకపోయేసరికీ విచిత్రమైన రీతిలో నిరసనలో అధికారుల వెంట తిరిగి అనుకున్నది సాధించాడు. వివరాల్లోకెళ్తే....బెంగాల్‌లోని శ్రీకాంత్ కుమార్ దత్తా అనే వ్యక్తికి తన రేషన్ కార్డులో పేరు తప్పుగా పడింది. దీంతో దూరే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులు శ్రీకాంత్ మెండల్ అనే పడింది. దీంతో సదరు వ్యక్తి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంతో దత్తా అని మార్చారు. దీంతో అతను మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఈసారి ఏకంగా శ్రీకాంతి కుమార్ కుత్తాగా మార్చారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో సదరు వ్యక్తి వినూత్నంగా కుక్కలా మొరుగుతూ...దురే సర్కార్ ప్రభుత్వా కార్యాలయంలోని అధికారుల చుట్టు ఆ రేషన్ కాగితాలతో తిరుగుతూ వివరిస్తాడు. అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధికారుని చూసి అతన్ని వెంబడించి....తన కాగితాలను కారు విండోలోంచి ఇచ్చి తన సమస్యను కుక్కలా అరుస్తూ వివరించాడు. సదరు అధికారి రెండు రోజుల్లో పేరు సరిచేస్తామని తనకు హామి ఇచ్చారని తెలిపాడు శ్రీకాంత్. తన పేరు రేషన్ కార్డులో పదేపదే తప్పుగా ప్రింట్ అవుతుండటంతో తో విసిగిపోయి ఇలా విచిత్రమైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ తన సమస్యను వివరించినట్లు చెప్పాడు. అంతకుముందు ఒక అధికారికి తన మొర వినిపించానని, అతను భయపడి పారిపోయాడని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు.. పేషంట్స్ సంగతేంటి?) -
చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !
Megastar Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు ఉన్నాయి. సోమవారం (జులై 4) 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పేరు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం విడుదలైన 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో చిరంజీవి పేరు ఇంగ్లీషు లెటర్స్‌లో అదనంగా 'E' అనే అక్షరం దర్శనమిచ్చింది. దీంతో చిరు MEGASTAR CHIRANJEEVIకి బదులుగా MEGASTAR CHIRANJEEEVI అని మార్చుకున్నట్లు పుకార్లు రచ్చ చేశాయి. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహితులు, గాడ్ ఫాదర్ చిత్రబృందం ఖండిస్తున్నారు. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు జరిగిన తప్పు మాత్రమే అని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకులేదని చెబుతున్నారు. ఎడిటింగ్ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్‌ల సలహా అస్సలు తీసుకోలేదని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వార్తపై చిరంజీవి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి -
తప్పుగా కాదు...కావాలనే అలా రాశా..
గుజరాత్: 'ఏనుగు' ఓ మంత్రిగారిని విమర్శలపాలు చేసింది. ఇంతకీ మంత్రివర్యులు చేసిన తప్పేంటనుకున్నారా? ఇంగ్లీష్‌లో ఏనుగు స్పెల్లింగ్ తప్పుగా రాయటమే. దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్‌ను బ్లాక్‌బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. 'A' బదులు 'E' రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్‌లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ... తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్ధాన్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక 2012లోనూ శంకర్ చౌదరిపై గుజరాత్ అసెంబ్లీలో ఐపాడ్లో అశ్లీల దృశ్యాలు చూశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం మంత్రి ఐపాడ్లో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. -
కుకుంబర్‌ను కుకర్బాంబ్ అన్నందుకు..
లండన్: బ్రిటన్‌లో నాలుగేళ్ల చిన్నారి ‘కుకుంబర్ (దోసకాయ)’ స్పెల్లింగ్‌ను ‘కుకర్ బాంబ్’ అని పొరపాటుగా పలకడం నేరమైంది. స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారిని తీవ్రవాద వ్యతిరేక చర్యలకు సిఫార్సు చేసింది. లూటన్‌లోని నర్సరీ పాఠశాలలో చదువుతున్న చిన్నారి.. ఒక మనిషి పెద్ద కత్తితో కూరగాయలను కోస్తున్న చిత్రాన్ని వేశాడు. అప్పుడు కుకుంబర్ అని చెప్పడానికి బదులు ‘కుకర్ బాంబ్’ అని పలికాడు. దీంతో పాఠశాల తమ బాబుకు శిక్ష విధించిందంటూ అతడి తల్లి వాపోయింది. కుకర్ బాంబ్ అని పలికినందుకు ఆ బాబును హోం శాఖ నిర్వహించే ఉగ్రవాద నిరోధక కార్యక్రమానికి పంపాలని ప్రతిపాదించామని పాఠశాల సిబ్బంది చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మెడి క్షనరీ
స్కాల్ప్ (ఇఅఔ్క) అంటే ? మనం మాడు భాగాన్ని ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అని వ్యవహరిస్తుంటాం. ముక్కు, చెవి, నుదురులాగే అది కూడా ఆ భాగం పేరుగా చాలామంది అనుకుంటుంటారు. నిజానికి స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. ఇంగ్లిష్‌లో ఐదుపదాల ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్’ అనే పదాన్ని రూపొందించారు. దీని స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాలూ ఇలా ఉంటాయి. ఎస్ అంటే స్కిన్ అనీ, సీ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ఏ అంటే ఎపోన్యూరోటికా అనీ, ఎల్ అంటే లూజ్ ఏరియోలా అనీ, పీ అంటే పెరియాస్టియమ్ అనే మాటలను సూచిస్తాయి. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలై నుంచి పి అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక భాగం వరకు వరసగా ఉంటే పొరలకు ఉన్న పేర్లతో స్కాల్ అనే మాట ఉద్భవించింది. -
బెండువాదులూ... బ్యాండువాదులు!
మొగుడు లేదా భర్త అనే మాటను ఇంగ్లిష్‌లో ‘హజ్బెండ్’ అని ఎందుకంటారా అని కొందరు భాషావేత్తలు పరిశోధించడం మొదలుపెట్టారు. ఎంత పెద్ద మొనగాడైనా సరే... భార్య ముందు ‘బెండ్’ కావాల్సిందే కదా. అందుకే దూరదృష్టితో మొగుణ్ణి ఇంగ్లిష్‌లో అలా అనడం మొదలుపెట్టారని కొందరు భాషావేత్తలు సిద్ధాంతీకరించారు. అసలు పరిశోధన అంటేనే ఒకరన్నమాటను మరొకరు విభేదించడం కదా. అందుకే... స్పెల్లింగ్‌లో హెచ్... యు... ఎస్... అక్షరాల తర్వాత ‘బెండ్’ అనే మాటను ఉచ్చారణగా తీసుకుంటున్నారనీ, వాస్తవానికి స్పెల్లింగ్ ప్రకారం అది ‘బ్యాండ్’ అని మరికొందరు వాదన మొదలుపెట్టారు. దాంతో ఈ ‘బెండ్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారి గొంతులో పచ్చి బెండకాయ పడినట్లయ్యింది. వారు తమ సిద్ధాంతాన్ని సమర్థించుకోడానికి మళ్లీ ఒక వాదన మొదలుపెట్టారు. మొదట్లో హస్బెండ్‌కు ‘బీ...ఈ...ఎన్...డీ’ అనే స్పెల్లింగ్ ఉండేదనీ, ఆ తర్వాత తమ బెండింగ్ వ్యవహారం లోకానికి తెలియడం గిట్టక దాన్ని ‘బీ...ఏ...ఎన్...డీ’ గా మార్చారని వాదించడం మొదలుపెట్టారు. ఇందులో మరికొందరు ముందుకెళ్లి... పెళ్లాం చేసే షాపింగ్గానీ, నగలూ, చీరలూ ఇత్యాది సామగ్రి కొనడం వల్ల ‘బ్యాండు’ పడేది మొగుడికే కాబట్టి బీ...ఏ...ఎన్...డీ అన్న స్పెల్లింగే కరెక్టనీ... దాన్ని ఎవరూ మార్చలేదని వాదించడం ప్రారంభించారు. ఈ దెబ్బతో ‘హస్బెండ్’ పదంపై పరిశోధన సాగించిన బృందం సభ్యులు కాస్తా ‘బెండు’వాదులగానూ, ‘బ్యాండు’ వాదులుగానూ చీలిపోయారు. ఇప్పటికీ ఒకరి మీద మరొకరు వ్యాసాలు, పోటీ వ్యాసాలు రాస్తూ బతికేస్తున్నారు. ఈలోపు ‘బెండకాయ’ అన్నది మధ్యకు కాస్త బెండైనట్లుగా ఉన్నందువల్లనే దానికా పేరంటూ ఉభయభాషాప్రవీణులు కాస్త సందడి చేస్తూ సబ్జెక్టు సీరియస్‌నెస్‌ను కాస్త పలచబార్చేందుకూ, పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు గానీ... అసలు సబ్జెక్టుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ల ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇంతలోనే ఇక్కడ తెలుగు మాట్లాడే చోట... మన తెలుగు భాషావేత్తలు కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంగ్లిష్‌వారు ఏం చేస్తే... దాన్ని తెలుగుకు అనువర్తిస్తూ వీళ్లు అదే పనిచేస్తుంటారు కాబట్టి... తెలుగుభాషావేత్తలు కొందరు ‘భర్త’ పదంపై పరిశోధన మొదలుపెట్టారు. తమ స్వభావరీత్యా వీళ్లు కూడా అచ్చం ఇంగ్లిష్వాదుల పంథాలోనే పరిశోధన ప్రారంభించారు. ‘భరించేవాడే భర్త’ అనే వాడుక తెలుగులో ఎప్పటినుంచో ఉందని, కాబట్టి ఇంగ్లిష్ భాషావేత్తలు కొత్తగా కనిపెట్టిందేమీ లేదని తెలుగుభాషావేత్తల భావన. ఈలోపు భర్త పదంపై మరింత లోతైన పరిశోధన జరిగింది. భార్య చేత భరతం పట్టబడేవాడు భర్త అనేది ఒక వ్యుత్పత్తి అని కొందరు ఔత్సాహికులు ఒక ప్రతిపాదన చేశారుగానీ... పాక్షికంగా ఆమోదిస్తూనే పరిశోధకులు కాస్త నసిగారు. భరతం పట్టబడటం అనే మాట చిన్నదనీ, భర్త వేదనలకు అంత చిన్నమాట సరిపోదని వారి అభిప్రాయం. ఎవరేమన్నా ఏతావాతా తేలిందేమిటంటే... హజ్బెండ్ అనే ఇంగ్లిష్ మాట సంగతైనా, భర్త అనే తెలుగు మాట విషయంలోనైనా ఎవరికి వారే స్వతంత్ర పరిశోధనలు సాగించినా... ఫలితం విషయంలో తేలిన వాస్తవం ఒకేలా ఉన్నందున పరిశోధకులు చెప్పిన మాటల్లో ఏ భాషలోనైనా భర్త భూమిక ఒకేలాంటిదన్న ఒక చారిత్రక సత్యం ఆవిష్కృతమైంది.