
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలకు కొత్త చట్టంలోని నిబంధనలను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం 4 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్‌పర్సన్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుడు, ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో కొత్త చట్టం లోని నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఏ ఎన్నిక విషయంలోనూ మార్పులు లేకుండా నిబంధనలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి. ఫలితాలు వెల్లడించిన తర్వాత సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మొత్తం వార్డు సభ్యులో సగం మంది హాజరు కావాలి. సమావేశం మొదలైన గంటలోపు కోరం సరిపడా సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment