ముఖ్యమంత్రి ప్రమేయం లేదు : డీజీపీ | DGP Clears Air On DSPs Transfer In AP | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి ప్రమేయం లేదు : డీజీపీ

Published Mon, Jun 4 2018 9:00 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

DGP Clears Air On DSPs Transfer In AP - Sakshi

డీజీపీ మాలకొండయ్య, సీఎం చంద్రబాబు (పాత ఫొటోలు)

సాక్షి, అమరావతి : డీఎస్పీల బదిలీ వ్యవహారం నిలిచిపోవడంపై ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ మాలకొండయ్య సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బదిలీల వ్యవహారంతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. తన కంటే ఇంటిలిజెన్స్‌ చీఫ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారడం అవాస్తవమని పేర్కొన్నారు.

డీఎస్పీల బదిలీలపై పీఈబీ చర్చిస్తోందని వెల్లడించారు. అందులో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ కూడా సభ్యులుగా ఉంటారని చెప్పారు. బదిలీ విషయంలో తాను చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాననటం అవాస్తవమని చెప్పారు. కాగా, ఏపీలో 24 మంది డీఎస్పీల బదిలీల విషయంలో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర రావు జోక్యం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement