దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదుచేసినా అతడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని కూడా ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.