
సాక్షి, అమరావతి: ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏబీవీ రావు సెస్పెండ్‌పై ట్విట్టర్ వేదికగా సజ్జల స్పందించారు. వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలులో దళారీగా పనిచేశారన్నారు. పరికరాలు కొని తనతో సహా మా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక మాఫియానే నడిపారని తెలిపారు. ఏబీవీ అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రజల రక్షణకోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాలకోసం ఏబీవీ పనిచేశారు. వైయస్సార్సీపీని దెబ్బతీయడానికి నిఘావ్యవస్థను ఉపయోగించారు. 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పనిచేశారు. పరికరాలు కొని నాతో సహా మా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేశారు. ఒక మాఫియా నడిపారు.
— Sajjala RamaKrishna Reddy (@SRKRSajjala) February 9, 2020
ఏబీవీ అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారు. @kesineni_nani
— Sajjala RamaKrishna Reddy (@SRKRSajjala) February 9, 2020