
సాక్షి, అమరావతి: ‘‘డబ్బు, మద్యం, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే, తమకే మేలు అని ఏ ప్రతిపక్షమైనా అనుకుంటుంది. అక్రమాలు లేకుండా స్థానిక ఎన్నికల కోసం సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం తమను ఓడించడానికేనంటూ వింత వాదన చేస్తున్నారని’’ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రజా బలం కోల్పోయినవారి ప్రవర్తన ఇలానే ఉంటుందని ఆయన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.
2014 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాయని సజ్జల తెలిపారు. అయినా వైఎస్సార్‌సీపీ బలంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, బేలతనం చూపలేదని సజ్జల రామకృష్ణారెడ్డి మరో ట్విట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment