
సాక్షి, న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం ముందుకు బుధవారం ఈ పిటిషన్ వచ్చింది.
ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కౌంటర్ రిజాయిండర్ దాఖలు చేయడానికి సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది లేఖ రూపంలో కోరడంతో విచారణను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment