
'మత్తయ్య నిందితుడని తెలియదు'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదుచేసినా అతడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని కూడా ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
మత్తయ్య నిందితుడైనా అతడు మీడియాతో మాట్లాడుతున్నా తన నివాసాన్ని ఎప్పటికప్పుడు మార్చడంతో అతడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామని ఓ దశలో పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మత్తయ్య విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఇంత జరిగినా.. మత్తయ్య నిందితుడన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ సీపీ చెప్పడం గమనార్హం.