
- ఇంత చిన్న పోస్టులో నేను చేరను
- అలిగి తొలగిన ఏబీ వెంకటేశ్వర రావు
నా ఏజ్ ఏంది.. .. నా గేజ్ ఏంది.. అన్నిటికి మించి నా రేంజ్ ఏంది.. అన్నీ తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా.. నా జూనియర్ల వద్ద నేను పని చేయాలా... వద్దు అంటూ మాజీ డిజి ఏబీ వెంకటేశ్వర రావు అలిగి కూర్చున్నారు. తనకు ఇచ్చిన పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా ఊరుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజి హోదాలో పార్టీ కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేసారు.. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర్నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించిమరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక అయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేసింది.. దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగారు.. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను విధుల్లోకి చేర్చుకున్న ప్రభుత్వం అదేరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఆశించారు. అలాంటిదేం లేకపోయినా రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా గుర్తిస్తూ దానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించేలా మాత్రం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక ఆయనకు మంచి ప్రాధాన్యం ఉండే పోస్టింగ్ పోస్టింగ్ ఇస్తారు అని ఆశించినా పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చి ఊరుకున్నా ప్రభుత్వం ఆయన్ను అక్కడికి పరిమితం చేసింది. అయితే అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు.. తన కింద పని చేసినవాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని.. ఇప్పుడు తాను వారివద్ద ఎలా పని చేస్తానని అంటూ ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు వచ్చినా నెలరోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంచించిన ఓ పోస్టులో పడేశారని.. అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని అయన అంటున్నారు.
ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని.. వారిపై ఆధిపత్యం .. పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం లేని హోసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలని అయన మధనపడుతున్నారు. ఇటీవలనే రిటైర్ అయిన డీజీపీ ద్వారకాతిరుమల రావును ఆర్టీసీ ఎండీగా నియమించారని.. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ను కూడా సర్వీసు పొడిగించి మరీ కొనసాగిస్తున్నారని.. అలాంటిది తాను తెలుగుదేశానికి ఇంత సేవలు చేస్తే తనకు ఇచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి ఆ పోస్టులో చేరకుండా అలకవహిస్తున్నట్లు తెలిసింది. మరి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను బుజ్జగిస్తారో.. ఇచ్చిందే ఎక్కువ తీసుకుంటే తీసుకో.. అలిగితే అట్టూ లేదు.. ముక్కా లేదని మిన్నకుంటారో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment