
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి: ఏపీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తోన్న ఏబీ వెంకటేశ్వరరావు, రైల్వేస్(ఏపీ) చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేఆర్‌ఎం కిషోర్ కుమార్, విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిరుమల రావులకు డీజీపీ స్థాయి హోదాను కల్పించింది. ప్రమోషన్ వచ్చిన ఈ ముగ్గురు ఐపీఎస్‌లు కూడా 1989 బ్యాచ్‌కు చెందినవారే. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ హోదాలో వీరికి రూ.205400 నుంచి 224400 మధ్య వేతనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment