సాక్షి, చీరాల: తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్ చేసి, వారిని రాజకీయంగా వాడుకోవడం సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని చీరాల ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు అని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని అన్నారు.
వెంకటేశ్వరావును ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పైకి బుద్ధి మంతుడిలా చంద్రబాబు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుద్దామనుకోవడం ఓటమితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చీరాలలో ఎవరు భయపడేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment