ec action
-
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది. -
‘రేయ్.. నీ అంతు చూస్తా’ : టీడీపీ ఎమ్మెల్యే
వెంకటగిరి (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. గతంలో సైదాపురం మండలంలో టీడీపీ నేతలకు మరుగుదొడ్లు, పింఛన్లు ఇవ్వాలని అధికారులపై తిట్ల దండకంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అది మరువకముందే రాపూరు ఉపాధి హామీ బే ఫుడ్ టెక్నికల్ అసిస్టెంట్ (బీఎఫ్‌టీఏ) వి.రామకృష్ణకు గురువారం ఉదయం ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ విషయమై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో అసభ్య పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉపాధి హామీ ఉద్యోగి మధ్య సాగిన ఫోన్ సంభాషణ ఇదీ.. ఉద్యోగి: సార్.. సార్.. ఎమ్మెల్యే: రేయ్.. నేను రా.. నీకు కూడు పెట్టింది. లం.. కొడకా. కూడు పెట్టినోడికి ఈ పని చేస్తావా? అందరినీ గుంపుగా పెట్టి మాట్లాడి అందరివీ ఇప్పిస్తావా (పోస్టల్ బ్యాలెట్లు).. వాళ్లకి? ఉద్యోగి: సార్.. సార్.. అది తప్పు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే: రేయ్.. నీ కథ నేను చూస్తారా. నీ అంతు చూస్తారా. వచ్చే గవర్నమెంట్ మాదే. నిలువునా.. నిలువునా నీ తాట తీస్తా. నీ అంతు చూస్తా. మొత్తం రాసిపెట్టాలే. ఐదు సంవత్సరాలు మేం ఉద్యోగం ఇచ్చి.. సాకితే మాకే ద్రోహం చేస్త్రారా మీరు. కడుపులో భయం ఉన్న వాళ్లయితే ఎవరికి ఇవ్వాలా. కడపులో భయం ఉందా నీకు? ఉద్యోగి: నిజం సార్. నాకు తెలీదు. ఎమ్మెల్యే: అబద్ధం చెప్పావంటే మెట్టుతో (చెప్పుతో) కొట్టేస్తా. నీకు ఇప్పుడు తెలియదులే.. తెలిసేరోజు తెలుస్తాదిలే. ఉద్యోగి: సార్.. సార్ ఒక్కరైనా నా దగ్గర ఇచ్చారని చెప్పమనండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. ఎమ్మెల్యే: ఉండవురా నువ్వు. రేపు ఉండవు నువ్వు. నీకు ఎవరు ఇచ్చారో డైరెక్షన్ నీ అంతు చూస్తా. వాడికి బుద్ధి లేదు. నడమంత్రపు చావు చస్త్రారా మీరు. చూస్తాలే మీ కథ. నీవు ఏమేం చేస్తావో అంతా తెలుసు నాకు. అంతా పెట్టిస్తా. మీ అంతు చూస్తా. రేయ్.. రేపు ఉదయం రారా వెంకటగిరికి.. రేపు ఉదయం రా. ఉద్యోగి: సరే సార్! ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతి తన పోస్టల్ బ్యాలెట్‌తోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే అంతు చూస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ ఉపాధి హామీ ఉద్యోగి వి.రామకృష్ణ గురువారం వెంకటగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్ మురళికి నెల్లూరులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.44 గంటల సమయంలో ఎమ్మెల్యే రామకృష్ణ తనకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే శాఖాపరంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తానని, అంతు చూస్తానని బెదిరించారని తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణ రౌడీయిజం, గూండాయిజం, స్మగ్లింగ్ వంటి అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడని, తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పోలీస్ చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉద్యోగిని బెదిరించిన ఫోన్‌కాల్ గురువారం సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
‘ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు’
సాక్షి, చీరాల: తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్ చేసి, వారిని రాజకీయంగా వాడుకోవడం సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని చీరాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు అని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని అన్నారు. వెంకటేశ్వరావును ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పైకి బుద్ధి మంతుడిలా చంద్రబాబు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుద్దామనుకోవడం ఓటమితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చీరాలలో ఎవరు భయపడేది లేదన్నారు. -
మోడీపై చర్యలకు ఈసీ సిఫార్సు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రం ఎదుటే బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని చూపుతూ మీడియా సమావేశంలో మాట్లాడటంతో నరేంద్ర మోడీ మీద ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 12 (1బి) సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది. నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసేవరకు ఏ రకమైన ప్రచారం చేయకూడదు. అందులోనూ అభ్యర్థి అయి ఉండి, తన ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడటం, అదంతా వీడియోలలో రికార్డు కావడంతో మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.