టీ20 వరల్డ్‌కప్-2024 నుంచి ఆ నిబంధన అమలు (PC: ICC)
ICC’s new stop clock rule- దుబాయ్: పురుషుల జట్లు బ్యాటింగ్‌లో ఎడాపెడా దంచేసినా, చుక్కలు చూపించినా పర్లేదు. కానీ బౌలింగ్ సమయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య నిక్కచ్చిగా 60 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకోవాలి. నింపాదిగా బౌలింగ్ చేస్తానంటే ఇకపై అస్సలు కుదరదు.
దుబాయ్‌లో సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘స్టాప్ క్లాక్’ నిబంధనను ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 ప్రపంచకప్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు టి20 ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మ్యాచ్‌లన్నింటికీ రిజర్వ్ డేలను ఖరారు చేసింది.
‘స్టాప్ క్లాక్’ నిబంధన?
రెండు ఓవర్ల మధ్య విరామ సమయాన్ని తగ్గించడమే ‘స్టాప్ క్లాక్’. ఒక బౌలర్ ఓవర్ ముగించిన వెంటనే మరో బౌలర్ 60 సెకన్లలోపే బౌలింగ్ చేయాలి. బౌలింగ్ జట్టు 60 సెకన్లలోపే ఓవర్ వేయకపోతే అంపైర్లు మూడుసార్లు హెచ్చరికలతో సరిపెడతారు. ఆ తర్వాత పునరావృతమైతే పెనాల్టీ విధిస్తారు.
చదవండి: MI: బుమ్రా, హార్దిక్‌ను వదిలేద్దామంటే.. రోహిత్ శర్మనే అడ్డుకున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment