కెప్టెన్ల సెల్ఫీ (PC: ICC Twitter)
T20 World Cup 2022: పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం(అక్టోబరు 16) వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్ ఆరంభం కానుంది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా శ్రీలంక- నమీబియా జట్ల మధ్య జిలాంగ్‌లోని కార్డీనియా పార్క్ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీకి తెరలేవనుంది.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనబోయే జట్లు ఆసీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ‘కెప్టెన్స్ డే’ కార్యక్రమంలో 16 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ ఐసీసీ ఈవెంట్, మెగా సమరానికి తాము సన్నద్ధమవుతున్న తీరు గురించి మాట్లాడారు.
PC: ICC Twitter
ట్రోఫీతో కెప్టెన్లు!
ఈ సందర్భంగా ఇండియా(రోహిత్ శర్మ), ఆస్ట్రేలియా(ఆరోన్ ఫించ్), ఇంగ్లండ్(జోస్ బట్లర్), పాకిస్తాన్(బాబర్ ఆజం), అఫ్గనిస్తాన్(మహ్మద్ నబీ), శ్రీలంక(దసున్ షనక), న్యూజిలాండ్(కేన్ విలియమ్సన్), బంగ్లాదేశ్(షకీబ్ అల్ హసన్), వెస్టిండీస్(నికోలస్ పూరన్), సౌతాఫ్రికా(తెంబా బవుమా), జింబాబ్వే(క్రెయిగ్ ఎర్విన్), నమీబియా(గెర్హార్డ్ ఎరాస్మస్), ఐర్లాండ్(ఆండ్రూ బల్బిర్నీ), స్కాట్లాండ్(రిచర్డ్ బెరింగ్టన్), నెదర్లాండ్స్(స్కాట్ ఎడ్వర్డ్స్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(సీపీ రిజ్వాన్) కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోకు ఫోజులిచ్చారు.
All the 16 captains in one frame 📸 🤩#NewCoverPic | #T20WorldCup pic.twitter.com/WJXtu0JEvx
— ICC (@ICC) October 15, 2022
ఇందుకు సంబంధించిన ఫొటోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు’’ అంటూ ట్వీట్ చేసింది. అదే విధంగా సారథులంతా ఒకేచోట చేరి తీసుకున్న సెల్ఫీని సైతం షేర్ చేసింది.
ఇదిలా ఉంటే.. అక్టోబరు 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరుతో సూపర్-12 దశ ఆరంభం కానుంది. ఆ మరుసటి రోజే హైవోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక నవంబరు 13న ఫైనల్ మ్యాచ్‌కు సైతం ఎంసీజీ వేదిక కానుంది.
Selfie time 😁🤳#T20WorldCup pic.twitter.com/snMOzdPMq3
— ICC (@ICC) October 15, 2022
చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు
Mitchell Starc-Buttler: 'నేనేమి దీప్తిని కాదు.. అలా చేయడానికి'
Comments
Please login to add a commentAdd a comment