
సాక్షి, ముంబై : రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం చాలా కష్టమని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోందని పేర్కొ న్నారు. ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కోసం భారత్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లా డారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సైతం పటిష్ఠంగా ఉన్నాయని డేవ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లో జరిగే ఈ ప్రపంచకప్‌లో 1992లో మాదిరి రౌండ్ రాబిన్ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
‘ప్రపంచ విజేత ఎవరో ఊహించడం కష్టం. నిజం చెప్పాలంటే భారత్ అత్యద్భుతంగా ఆడుతోంది. ఈ మధ్య కాలంలో టీమిండియాలో మెరుగు దలను చూస్తుంటే ఆ జట్టును ఓడించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా సైతం అదరగొడు తోంది. ’ అని రిచర్డ్‌సన్ తెలిపారు. ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో స్నేక్ పద్ధతిని అనుసరించడంతోనే లీగ్ దశలో భారత్, పాక్ తలపడే అవకాశం రాలేదని డేవ్ అన్నారు. ర్యాంకుల ప్రకారం వరుసగా ఒక్కో జట్టును రెండు గ్రూపుల్లో అమర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బహుశా ఈ రెండు జట్లు సెమీస్ లేదా ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment