David Richardson
-
భారత్‌ను ఓడించడం కష్టం
సాక్షి, ముంబై : రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం చాలా కష్టమని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్ అన్నారు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోందని పేర్కొ న్నారు. ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కోసం భారత్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లా డారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సైతం పటిష్ఠంగా ఉన్నాయని డేవ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లో జరిగే ఈ ప్రపంచకప్‌లో 1992లో మాదిరి రౌండ్ రాబిన్ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రపంచ విజేత ఎవరో ఊహించడం కష్టం. నిజం చెప్పాలంటే భారత్ అత్యద్భుతంగా ఆడుతోంది. ఈ మధ్య కాలంలో టీమిండియాలో మెరుగు దలను చూస్తుంటే ఆ జట్టును ఓడించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా సైతం అదరగొడు తోంది. ’ అని రిచర్డ్సన్ తెలిపారు. ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో స్నేక్ పద్ధతిని అనుసరించడంతోనే లీగ్ దశలో భారత్, పాక్ తలపడే అవకాశం రాలేదని డేవ్ అన్నారు. ర్యాంకుల ప్రకారం వరుసగా ఒక్కో జట్టును రెండు గ్రూపుల్లో అమర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బహుశా ఈ రెండు జట్లు సెమీస్ లేదా ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుందన్నారు. -
ఐసీసీ కొత్త సీఈవో మను సాహ్ని
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఈఎస్‌పీఎస్ స్టార్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మను సాహ్ని నియమితులయ్యారు. ఇతను డేవిడ్ రిచర్డ్సన్ స్థానంలో సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంగ్లండ్‌లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌తో రిచర్డ్సన్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఐసీసీ అపెక్స్ కమిటీ చైర్మన్ శశాంక్ మనోహర్, నామినేషన్స్ కమిటీ కొత్త సీఈవోగా సాహ్నిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం జూలైలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపడతారు. సింగపూర్ స్పో ర్ట్స్ హబ్‌కు మను గతంలో సీఈవోగా పనిచేశాడు. ఈఎస్‌పీఎన్‌లో కూడా గతం లో కీలక బాధ్యతలు నిర్వహించారు. -
98.5 శాతం సరైన నిర్ణయాలే!
అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ను ఉపయోగించడం వల్ల అంపైర్లు 98.5 శాతం వరకు సరైన నిర్ణయాలు వెలువరిస్తున్నారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. 94 శాతం వరకు సరైన ఫలితాలు రావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నా... అది మరింత మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. డోపింగ్ ఫలితాలను మరింత పక్కాగా తేల్చేందుకు ఈ ఏడాది నుంచి రక్త పరీక్షలు కూడా ప్రవేశ పెడుతున్నామన్న రిచర్డ్సన్ ... క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంపై మరోసారి త్వరలోనే చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
హర్భజన్‌ను మెచ్చుకోవాల్సిందే: ఐసీసీ సీఈఓ
న్యూఢిల్లీ: నిబంధనలకు లోబడి బౌలింగ్ చేయని బౌలర్లపై ఐసీసీ విరుచుకుపడటంలో ఎటువంటి దురాలోచనలు లేవని ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. అయితే సస్పెన్షన్‌కు గురైన బౌలర్లు.. తమ యాక్షన్‌ను సరిచేసుకొని మళ్లీ మైదానంలో అడుగు పెట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత బౌలర్ హర్భజన్ సింగ్‌ను మెచ్చుకోవాలని ఆయన అన్నారు. ‘హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే బౌలింగ్‌ను మెరుగుపరచుకోవడంలో అతడు సఫలమయ్యాడు. ప్రస్తుతం చాలా మంది బౌలర్లు నిబంధనల కంటే ఎక్కువగా మోచేతిని వంచుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలన్న ఐసీసీ నిర్ణయాన్ని క్రికెట్ కమిటీ కూడా సమర్థించింది. సస్పెండ్ అయిన బౌలర్లు వారి యాక్షన్‌ను సరిచేసుకోవాలని చూస్తున్నారు. చర్యల వల్ల నిబంధనలకు అనుగుణంగా బౌలింగ్ చేసే వారిని మాత్రమే జట్టులోకి తీసుకోవాలని గట్టి సంకేతాలు వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు హర్భజన్ పాల్గొన్నారు. యాక్షన్ సరిగా లేని బౌలర్లను క్రికెట్ ఆడవద్దని ఐసీసీ చెప్పట్లేదని, బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకొని మళ్లీ రావచ్చని హర్భజన్ తెలిపాడు.