
98.5 శాతం సరైన నిర్ణయాలే!
అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ను ఉపయోగించడం వల్ల అంపైర్లు 98.5 శాతం వరకు సరైన నిర్ణయాలు వెలువరిస్తున్నారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. 94 శాతం వరకు సరైన ఫలితాలు రావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నా... అది మరింత మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.
డోపింగ్ ఫలితాలను మరింత పక్కాగా తేల్చేందుకు ఈ ఏడాది నుంచి రక్త పరీక్షలు కూడా ప్రవేశ పెడుతున్నామన్న రిచర్డ్సన్ ... క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంపై మరోసారి త్వరలోనే చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.